Share News

లిక్కర్‌ ఫ్యాక్టరీల్లో సీఐడీ సోదాలు

ABN , Publish Date - Oct 23 , 2024 | 01:24 AM

పెదవేగి మండలం వంగూరులోని గౌతమీ ఆగ్రో ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(లిక్కర్‌ ఫ్యాక్టరీ)లో ఏపీ సీఐడీ అధికారులు మంగళ వారం తనిఖీలు నిర్వహించారు.

 లిక్కర్‌ ఫ్యాక్టరీల్లో సీఐడీ సోదాలు

పెదవేగి/ఉంగుటూరు, అక్టోబరు 22: పెదవేగి మండలం వంగూరులోని గౌతమీ ఆగ్రో ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(లిక్కర్‌ ఫ్యాక్టరీ)లో ఏపీ సీఐడీ అధికారులు మంగళ వారం తనిఖీలు నిర్వహించారు. సీఐడీ డీఎస్పీ సత్యానందం సహా ఆరుగురు అధికా రుల నేతృత్వంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో గత నాలుగేళ్ళలో మద్యం తయారీ, లావా దేవీల్లో జరిగిన అవకతవకలపై విచారణ నిర్వహించినట్లు సమాచారం. గత నాలుగేళ్ళ లో ఏ బ్రాండ్లు తయారు చేశారు. నాణ్యతా ప్రమాణాలు పాటించారా, లేదా అనే దానిపై విచారణ నిర్వహించారు. డిస్టిలరీకి రికార్డుల ను స్వాధీనం చేసుకున్నారు. డిస్టిలరీ ఇన్‌చార్జ్‌ ఎక్సైజ్‌ సీఐ సాయి స్వరూప్‌, ఏలూరు ఎక్సైజ్‌ సీఐ కృష్ణ ధనరాజ్‌ తదితరులు పాల్గొన్నారు. ఉంగుటూరు మండలం చేబ్రోలు సోరింగ్‌ స్పిరిట్స్‌ (లిక్కర్‌ ఫ్యాక్టరీ)లో రాజమహేంద్ర వరం సీఐడీ అదనపు ఎస్పీ ఫరహీన్‌ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - Oct 23 , 2024 | 01:24 AM