రాష్ట్రంలో క్లీన్ ఎనర్జీ
ABN , Publish Date - Oct 31 , 2024 | 04:21 AM
రాష్ట్రమంతా క్లీన్ ఎనర్జీని వినియోగించేలా పాలసీ డాక్యుమెంట్‌ను బుధవారం రాష్ట్ర ఇంధన శాఖ విడుదల చేసింది.
7.5 లక్షల కోట్ల పెట్టుబడులు, 10 లక్షల మందికి ఉపాధి లక్ష్యం
అమరావతి, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రమంతా క్లీన్ ఎనర్జీని వినియోగించేలా పాలసీ డాక్యుమెంట్‌ను బుధవారం రాష్ట్ర ఇంధన శాఖ విడుదల చేసింది. ఏడున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, పది లక్షల మందికి ఉపాధి అవకాశాలే లక్ష్యంగా ఈ పాలసీ డాక్యుమెంటును విడుదల చేసింది. ఈ మేరకు బుధవారం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఉత్తర్వ జారీ చేశారు. రాష్ట్రంలో సౌర విద్యుత్తు 78.50 గిగావాట్లు, పవన విద్యుత్తు 35 గిగావాట్లు, 22 గిగావాట్ల పంప్డ్, 25 గిగావాట్ల బ్యాటరీ స్టోరేజి విద్యుత్తు ఉత్పత్తి లక్ష్యంగా ఈ పాలసీని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. అదేవిధంగా గ్రీన్ హైడ్రోజన్ 1.50 ఎంపీటీఏ ఉత్పత్తి, బయో ఫ్యూయల్స్ తయారీ, 5000 ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు, సోలార్ ప్యానళ్ల తయారీ, బ్యాటరీ మాన్యుఫ్యాక్చరింగ్, ఎలకో్ట్రలైజర్స్ త యారీకి పాలసీలో అనుమతులు ఇస్తారు. క్లీన్ ఎనర్జీ లో పెట్టుబడులు పెట్టేవారికి 25 శాతం క్యాపిటల్ ఇన్వె్‌స్టమెంట్ సబ్సిడీని అందిస్తారు. ఐదేళ్లలోనే పరిశ్రమలు ఉత్పత్తిని చేపట్టాలని షరతు విధించారు. ప్రభు త్వం, ఎన్‌ఆర్‌ఈడీసీఎపీ భూములు సేకరించి క్లీన్ ఎనర్జీ సంస్థలకు ఏటా 31,000లకు లీజుకు ఇస్తాయి.