Share News

ఇసుక తవ్వకం చార్జీలే వసూలు చేయాలి

ABN , Publish Date - Nov 28 , 2024 | 04:53 AM

ఇసుక రీచ్‌ల్లో వినియోగదారుల నుంచి కేవలం తవ్వకం చార్జీలే వసూలు చేయాలని, అంతకుమించి మరే అదనపు భారం వేయవద్దని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

ఇసుక తవ్వకం చార్జీలే వసూలు చేయాలి

  • గనుల శాఖకు సీఎం ఆదేశం

అమరావతి, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): ఇసుక రీచ్‌ల్లో వినియోగదారుల నుంచి కేవలం తవ్వకం చార్జీలే వసూలు చేయాలని, అంతకుమించి మరే అదనపు భారం వేయవద్దని సీఎం చంద్రబాబు ఆదేశించారు. నదీప్రాంతాలు, రీచ్‌లు లేని జిల్లాల్లో కూడా ఇసుక సులభంగా లభించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని గనుల శాఖకు సూచించారు. బుధవారం సచివాలయంలో ఇసుకపై సమీక్ష చేశారు. ఇసుక ధరలు ఇంకా తగ్గించే మార్గాలు అన్వేషించడంతో పాటు రవాణా ఖర్చుల భారం తగ్గించేలా చూడాలని నిర్దేశించారు. ఫిర్యాదులు, సూచనలను ఆర్‌టీజీఎ్‌సతో అనుసంధానించాలని ఆదేశించారు. అక్రమ రవాణా, విక్రయాలను ఉక్కుపాదంతో అణచివేయాలని గనులు, పోలీసు శాఖలను సీఎం ఆదేశించారు.

Updated Date - Nov 28 , 2024 | 04:53 AM