Share News

Amaravati: అతనికి మరణ శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి.. బద్వేల్ ఘటనపై సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Oct 20 , 2024 | 03:26 PM

వైఎస్‌ఆర్‌ జిల్లా బద్వేల్‌లో ప్రేమోన్మాది పెట్రోల్‌ దాడి ఘటనలో ఇంటర్‌ విద్యార్థిని మృతి చెందడంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేసును ప్రత్యేక ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ద్వారా విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Amaravati: అతనికి మరణ శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి.. బద్వేల్ ఘటనపై సీఎం చంద్రబాబు

అమరావతి: వైఎస్‌ఆర్‌ జిల్లా బద్వేల్‌లో ప్రేమోన్మాది పెట్రోల్‌ దాడి ఘటనలో ఇంటర్‌ విద్యార్థిని మృతి చెందడంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేసును ప్రత్యేక ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ద్వారా విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నేరస్థుడికి మరణశిక్ష స్థాయిలో శిక్ష పడేలా చూడాలని ఆదేశించినట్లు ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడేవారికి అతనికి పడే శిక్ష ఒక హెచ్చరికగా ఉండాలని అన్నారు.


‘‘వైఎస్ఆర్ జిల్లా బద్వేల్‌లో యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో తీవ్రంగా గాయడిన ఇంటర్ విద్యార్థిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధాకరం. ఈ ఘటన నన్ను ఎంతగానో కలచివేసింది. ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థిని ఒక దుర్మార్గుడి దుశ్చర్యకు బలి కావడం విచారకరం. నిందితుడిని అరెస్టు చేశామని జిల్లా అధికారులు తెలిపారు. ఈ కేసులో వేగంగా విచారణ పూర్తి చేసి, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని ఆదేశించాను. బాధిత కుటుంబానికి న్యాయం చేయడం అంటే....హంతకుడిని త్వరగా, చట్టబద్దంగా, కఠినంగా శిక్షించడమే. అందుకే ప్రత్యేక కోర్టులో ఫాస్ట్ ట్రాక్ విధానంలో ఈ కేసు విచారణ పూర్తి చేసి నేరస్తుడికి మరణశిక్ష స్థాయి శిక్ష పడేలా చూడాలని అధికారులను ఆదేశించాను. మహిళలు, ఆడబిడ్డలపై అఘాయిత్యాలు చేసేవారికి ఈ ఘటనలో పడే శిక్ష ఒక హెచ్చరికగా ఉండాలని అధికారులకు సూచించాను’’ అని పేర్కొన్నారు.


వదిలిపెట్టం..

బద్వేల్ ఘటనకు కారణమైన నిందితుడిని వదిలేది లేదని మంత్రి సవిత స్పష్టం చేశారు. బాధితురాలి కుటుంబానికి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. "బాలిక మృతి బాధాకరం. నిందితుడు విఘ్నేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనికి కఠిన శిక్ష పడేలా చేస్తాం. ప్రత్యేక కోర్టులో ఫాస్ట్ ట్రాక్ విధానం ద్వారా కేసు త్వరితగతిన విచారిస్తాం. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది" అని మంత్రి తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి

ABN Effect: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వరస కథనాలతో HMDA అధికారుల్లో కదలిక..

Group-1 Exam: మరోసారి రోడ్డెక్కిన గ్రూప్-1 బాధితులు.. అశోక్‌నగర్‌లో ఉద్రిక్తత..

HYDRA: హైడ్రా చీఫ్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు

For Telangana News And Telugu News...

Updated Date - Oct 20 , 2024 | 03:40 PM