CM ChandraBabu: సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్
ABN , Publish Date - Oct 09 , 2024 | 08:53 PM
త్వరలో నామినేటెడ్ పదవులు రెండో విడత భర్తీ చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తమపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు, ఫేక్ ప్రచారాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిపై ఓపిక పడుతున్నామన్నారు. వారి దురుద్దేశాలు, దుష్ప్రచారాలు తొలుత ఎక్స్‌పోజ్ చేయాలని చెప్పారు. అయితే వారు మితిమీరితే ఏం చేయాలో తనకు తెలుసునని హెచ్చరించారు. కానీ తక్షణ చర్యలు చేపట్టడం సరైన విధానం కాదని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
అమరావతి, అక్టోబర్ 09: గత ప్రభుత్వ హయాంలో అందరి కంటే తానే ఎక్కువ ఇబ్బంది పడ్డానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. బుధవారం అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. తాను 53 రోజుల పాటు జైల్లో ఉన్నానని గుర్తు చేసుకున్నారు. తనను చంపాలని చూశారనే ప్రచారమూ సైతం జరిగిందన్నారు. జైలు మీద డ్రోన్లు కూడా ఎగుర వేశారని చెప్పారు. తన ప్రతీ కదలిక గమనించటానికి జైలు గదిలో సీసీ కెమెరాలను అమర్చారన్నారు. స్నానానికి కనీసం వేడి నీళ్లు సైతం ఇవ్వలేదని.. అలాగే దోమలు కుడుతుంటే దోమ తెర కూడా ఇవ్వలేదన్నారు.
Also Read: ఏపీకి గుడ్ న్యూస్.. ఇక వారికి ఢోకా లేదు..!
Also Read: వరుసగా బ్యాంకులకు సెలవులు
సీఎం స్ట్రాంగ్ వార్నింగ్.. తన స్వభావం అది కాదు..
ఇంత అనుభవించిన తాను.. జైలు నుంచి బయటకు రాగానే.. ముందు కక్ష తీర్చుకోవాలి కదా? కానీ తనది ఆ స్వభావం కాదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇక గత ఐదేళ్లు ఇబ్బందులు పడిన వారి బాధలు సైతం తనకు తెలుసునన్నారు. తప్పు చేసిన ఏ ఒక్కరూ తప్పించుకోలేరని ఆయన గట్టిగా హెచ్చరించారు. సరైన సమయంలో వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
Also Read: దుర్గాష్టమి.. అమ్మవారిని ఇలా పూజించండి..
Also Read: రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి
హైదరాబాద్‌లో డ్రై పోర్ట్..
హైదరాబాద్ - విజయవాడ మధ్య గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే అవసరమని ఆయన పేర్కొన్నారు. బెంగుళూరు - చెన్నై మధ్య ఏర్పాటు చేస్తున్న ఈ తరహా హైవే వల్ల ప్రయాణ సమయం బాగా తగ్గుతుందన్నారు. విజయవాడ - హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ హైవేను బందరు పోర్టుకు అనుసంధానిస్తామని చెప్పారు. దీని వల్ల హైదరాబాద్‌లోనూ డ్రై పోర్టు వస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అధిక శాతం రైలు కనెక్టవిటీ 4 లైన్లు ఏర్పాటు కానుందని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక విజయవాడ తూర్పు బైపాస్ రహదారి గన్నవరం విమానాశ్రయ వద్ద కలుస్తుందని చెప్పారు.
Also Read: కేంద్రమంత్రికి సీఎం లేఖ.. ఆగిన వేలం
Also Read: జీతం ఇచ్చేందుకు రెడీ.. మీరు సిద్దమా అని సవాల్
ధరలు పెరుగుదల.. సమీక్షిస్తాం
అలాగే నిత్యావసర ధరలు పెరుగుతున్నాయన్నారు. ఈ ధరలను సమీక్షిస్తున్నామని తెలిపారు. భారీ వర్షాల కారణంగా పంటలు దెబ్బతిని ఈ పరిస్థితి వచ్చిందేమో చూడాలన్నారు. ఈ ధరల్ని సమీక్షిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఢిల్లీ ఇన్నిసార్లు వెళ్లటం వల్ల రాష్ట్ర పరిస్థితులు చక్కబడుతున్నాయని వివరించారు. ఇంకా తమ ప్రయత్నాలు తాము చేస్తూనే ఉంటామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Also Read: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ
Also Read: ఇలా చేస్తే మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీకి ఎక్కువ లైఫ్ ఉంటుంది.. అది ఎలాగంటే..?
త్వరలో రెండో విడత నామినేటెడ్ పదవులు భర్తీ
త్వరలో నామినేటెడ్ పదవులు రెండో విడత భర్తీ చేస్తామన్నారు. తమపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు, ఫేక్ ప్రచారాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిపై ఓపిక పడుతున్నామన్నారు. వారి దురుద్దేశాలు, దుష్ప్రచారాలు తొలుత ఎక్స్‌పోజ్ చేయాలన్నారు. అయితే వారు మితిమీరితే ఏం చేయాలో తనకు తెలుసునని హెచ్చరించారు. కానీ తక్షణ చర్యలు చేపట్టడం సరైన విధానం కాదని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
For AndhraPradesh News And Telugu News...