Home » Jagan Mohan Reddy
శ్రీసత్యసాయి జిల్లా పాపిరెడ్డిపల్లిలో జగన్ పర్యటనలో భద్రతపై వచ్చిన ఆరోపణలపై పోలీసులు విచారణ ప్రారంభించారు. వైసీపీ కార్యకర్తలు హెలికాప్టర్‌ను చుట్టుముట్టి బారికేడ్లను తొలగించిన తర్వాత హెలికాప్టర్ విండ్‌షీల్డ్ దెబ్బతినడంపై దర్యాప్తు జరుగుతోంది
జగన్ పోలీసులను హెచ్చరిస్తూ టీడీపీ నాయకులకు వాచ్మెన్లుగా పని చేస్తున్న వారిని ఉద్యోగాలు పీకేస్తామంటూ హెచ్చరించారు. లింగమయ్య హత్య కేసులో పోలీసులపై ఆరోపణలు.
తాము అధికారంలోకి వస్తే పోలీసుల బట్టలు విప్పిస్తామని మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎస్పీ రత్న స్పందించారు. పోలీస్ యూనిఫామ్ ఎవరో తమకు ఇచ్చింది కాదని, తాము కష్టపడి సాధించామని చెప్పారు.
శ్రీ సత్యసాయి జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఏకంగా పోలీసులపైనే దాడి చేసి హెలికాప్టర్ వైపు దూసుకెళ్లారు.
సరస్వతీ పవర్ అండ్ ఇండస్ర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ షేర్ల బదిలీపై తన తల్లి వైఎస్ విజయలక్ష్మి, చెల్లి వైఎస్ షర్మిల మోసగించారని మాజీ సీఎం జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు.
ప్రభుత్వం మారిపోయింది.. కాబట్టి వ్యవస్థ మొత్తం కూటమి ప్రభుత్వ కనుసన్నల్లో నడుస్తోందని అనుకుంటే పొరపాటే! ఎక్సైజ్ శాఖకు సంబంధించిన సమాచారం అంతా ఇప్పటికీ తాడేపల్లి ప్యాలెస్‌కు చేరుతోంది.
జగన్ జమానాలో పూర్తిగా చిన్నాభిన్నమైపోయిన రహదారులను పునర్నిర్మించాలని కూటమి సర్కారు నిర్ణయించింది. గ్రామీణ, జిల్లా, రాష్ట్ర ప్రధాన(ఎ్‌సహెచ్) రహదారులను తిరిగి 2014 నాటి స్థితికి తీసుకొచ్చేందుకు ఆర్అండ్ బీకి భారీగా నిధులు ఆఫర్‌చేసింది.
వైసీసీ అధినేత జగన్ చుట్టూ ఉన్న కోటరీ వల్లే ఆ పార్టీని వదిలి బయటకు వచ్చానని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. వైసీపీలోని ద్వితీయశ్రేణి నాయకులు తనకు, అధినేత జగన్‌కు మధ్య అభిప్రాయ భేదాలు సృష్టించారని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.
Nara Lokesh Comments Jagan : జగన్ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12 లక్షల మంది బడి పిల్లల భవిష్యత్తు నిర్వీర్యమైందని అసెంబ్లీ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి నారా లోకేష్. ఈ సందర్భంగా జగన్ పై సెటైరికల్ కామెంట్లు చేశారు.
ప్రతిపక్షనేత హోదా దక్కదని తెలిసినా జగన్ తన వైఖరి ఎందుకు మార్చుకోవడంలేదు. ప్రజల తరపున ప్రశ్నించాల్సిన వైసీపీ ఎందుకు వెనుకడుగు వేస్తోంది. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వైసీపీ నేతలు తమ బాధ్యతలను ఎందుకు నిర్వర్తించడంలేదు. రాదని తెలిసినా ప్రతిపక్షహోదా నినాదంతో ప్రజలను మోసం చేస్తున్నారా.