Share News

ఉత్తరాంధ్రలో చలిపులి!

ABN , Publish Date - Nov 20 , 2024 | 06:11 AM

ఉత్తరాంధ్రలో చలి తీవ్రత పెరిగింది. ప్రధానంగా ఉమ్మడి విశాఖ మన్యంలో జనాన్ని చలిపులి వణికిస్తోంది.

ఉత్తరాంధ్రలో చలిపులి!

విశాఖపట్నం, చింతపల్లి, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రలో చలి తీవ్రత పెరిగింది. ప్రధానంగా ఉమ్మడి విశాఖ మన్యంలో జనాన్ని చలిపులి వణికిస్తోంది. మంగళవారం డుంబ్రిగుడలో 8.2, జి.మాడుగులలో 8.4, అరకులోయలో 8.5, పాడేరులో10.9, ముంచంగిపుట్టులో 10.9, గూడెంకొత్తవీధిలో 11.4, చింతపల్లిలో 11.3,డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

23న అల్పపీడనం: ఈ నెల 21న అండమాన్‌ సముద్రంలో ఉపరితల ఆవర్తనం, దీని ప్రభావంతో 23న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణశాఖ తెలిపింది.

Updated Date - Nov 20 , 2024 | 06:11 AM