Share News

ప్రతి అర్జీని ఆడిటింగ్‌ చేస్తాం : కలెక్టర్‌

ABN , Publish Date - Dec 03 , 2024 | 12:33 AM

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)కు అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి ఆదేశిం చారు.

ప్రతి అర్జీని ఆడిటింగ్‌ చేస్తాం : కలెక్టర్‌
ఫిర్యాదులు అందుకుంటున్న కలెక్టర్‌ వెట్రిసెల్వి

ఏలూరు రూరల్‌, డిసెంబరు 2 (ఆంధ్ర జ్యోతి) : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)కు అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి ఆదేశిం చారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో జేసీ పి.ధాత్రిరెడ్డి, డీఆర్వో విశ్వేశ్వరరావు, డీఆర్‌డీఏ పీడీ ఆర్‌.విజయ్‌రాజు, ఆర్డీవో అచ్యుత అంబ రీష్‌ తదితరులతో కలిసి అర్జీలు స్వీకరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ‘ప్రతి అర్జీని ఆడిటింగ్‌ చేస్తాం. అర్జీల పరిష్కార ప్రగతిని ప్రతివారం సమీక్షిస్తా’మన్నారు. వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్‌ సిబ్బంది పాల్గొన్నారు.

సైబర్‌ నేరగాళ్ల ఫోన్‌కాల్స్‌ పట్ల అప్రమత్తంగా ఉండండి : ఎస్పీ

ఏలూరు క్రైం, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి) : ఢిల్లీ, ముంబై, కోలకత్తా, చెన్నైల నుంచి సీబీఐ, ఈడీ అధికారులమని చెప్పి ఫోన్లు చేసి సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నారని ఇలాంటి ఫోన్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ కేపీఎస్‌ కిశోర్‌ సూచించారు. సోమవారం జిల్లా పోలీస్‌ కార్యాలయం లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఏఎస్పీ సూర్యచంద్ర రావుతో కలసి ఫిర్యాదు లను స్వీకరించారు.

Updated Date - Dec 03 , 2024 | 12:33 AM