‘మహిళలకు ఉచిత బస్సు’పై కమిటీ
ABN , Publish Date - Dec 22 , 2024 | 03:17 AM
సూపర్ సిక్స్ హామీల్లో కీలకమైన మహిళలకు ఉచిత బస్సు పథకం అమలుకు రంగం సిద్ధమవుతోంది.
పథకంపై అధ్యయనానికి ముగ్గురు మంత్రులతో ఏర్పాటు
అమరావతి, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): సూపర్ సిక్స్ హామీల్లో కీలకమైన మహిళలకు ఉచిత బస్సు పథకం అమలుకు రంగం సిద్ధమవుతోంది. ఈ దిశగా కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉన్న మహిళల ఉచిత బస్సు పథకం అమలును అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం మంత్రులతో ఒక కమిటీ ఏర్పాటు చేసింది. రవాణా శాఖ మంత్రి చైర్మన్‌గా, హోంమంత్రి, మహిళా శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సభ్యులుగా ఉండే కమిటీకి రవాణా, రోడ్లు, భవనాల శాఖ ముఖ్యకార్యదర్శిని కన్వీనర్‌గా నియమిస్తూ సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్ శనివారం జీవో జారీ చేశారు. వీలైనంత త్వరగా ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని సీఎస్ ఆదేశించారు. మహిళలకు ఉచిత బస్సు పథకం తెలంగాణ, కర్ణాటకలో ప్రస్తుతం అమల్లో ఉంది. ఆ రాష్ట్రాల్లో మంత్రుల కమిటీ పర్యటించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది.