Share News

Pawan Kalyan: నెలరోజుల్లో 1,846 ఉపాధి హామీ పనులు పూర్తి

ABN , Publish Date - Nov 10 , 2024 | 08:28 PM

పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల్లో భాగంగా చేపట్టిన ఉపాది హామీ పనులు వేగంగా జరుగుతున్నాయి. అందులోభాగంగా నెల రోజుల్లోపే 1,846 పనులు పూర్తయ్యాయి. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 14 నుంచి 20వ తేదీ వరకు పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు నిర్వహించాలని గతంలో ఉన్నతాధికారులను డిప్యూటీ సీఎం పవన్ ఆదేశించిన సంగతి తెలిసిందే.

Pawan Kalyan: నెలరోజుల్లో 1,846 ఉపాధి హామీ పనులు పూర్తి
Dy CM Pawan Kalyan

అమరావతి, నవంబర్ 10: నెల రోజుల్లోపే 1,846 ఉపాధి హామీ పనులు పూర్తయ్యాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. పల్లె పండగ పంచాయతీ వారోత్సవాల్లో భాగంగా గత అక్టోబర్ 14 -20 తేదీల మధ్య రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పనులకు ప్రజాప్రతినిధులు భూమి పూజ చేసిన సంగతి తెలిసిందే. అందులోభాగంగా గ్రామీణ మౌలిక సదుపాయాలైన సిసి రోడ్లు, బిటి రోడ్లకు సంబంధించి 26,857 పనులకు ఆమోదం తెలిపారు.

Also Read:Palla Srinivasa Rao: జగన్ ట్వీట్.. అబద్దాల పుట్ట..

Also Read: జున్ను తినడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..?


అయితే ప్రారంభమైన ఈ పనులన్నీ ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నాయి. వాటిలో నవంబర్ 8వ తేదీ నాటికి దాదాపు 1,686 పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు ప్రగతి దశలో ఉన్నాయి. వ్యక్తిగత పనులు.. గోకులాలు, గొర్రెల షెడ్లు, కోళ్ల షెడ్లకు సంబంధించి 22,525 పనులు పూర్తి చేయాలన్నది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో 159 షెడ్ల పనులు పూర్తయి లబ్ధిదారులకు అందుబాటులోకి వచ్చాయి. ఇక సంక్రాంతి పండుగ లోపు మిగిలిన పనులన్నింటిని పూర్తి చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయా పనులు అనుకున్న సమయానికి పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు.

Also Read: విమాన ప్రయాణికులకు శుభవార్త..!

Also Read: PM Modi: జార్ఖండ్‌ను దోచుకున్న సోరెన్ సర్కార్

Also Read: CM Revanth Reddy: పాలమూరుని అభివృద్ధి చేసుకోనివ్వండి


అక్టోబర్ 14వ తేదీన గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను "పల్లె పండుగ- పంచాయతీ వారోత్సవాలు" పేరిట కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. అందులోభాగంగా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతోపాటు రైతులకు ఉపయోగపడేలా అభివృద్ధి పనులను ఈ ప్రభుత్వం చేపట్టింది. ఈ ఏడాది ఆగస్ట్‌ 23వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయితీల్లో ఒకే రోజున గ్రామసభలు నిర్వహించారు. ఇది వరల్డ్ రికార్డ్ యూనియన్ అవార్డు సైతం దక్కించుకుంది. నాటి సభల్లో తీసుకున్న నిర్ణయాల మేరకు పల్లె సీమల్లో ఈ పనులు చేపడుతున్నారు.

For Andhrapradesh News And Telugu News

Updated Date - Nov 10 , 2024 | 08:28 PM