Share News

రైల్వే వ్యాగిన వెంటనే పూర్తి చేయండి

ABN , Publish Date - Dec 01 , 2024 | 11:47 PM

కర్నూలు రైల్వే వ్యాగినను వెంటనే పూర్తి చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని డీవైఎ్‌ఫఐ జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర, కార్యదర్శి నగేష్‌ డిమాండ్‌ చేశారు.

రైల్వే వ్యాగిన వెంటనే పూర్తి చేయండి
సమావేశంలో మాట్లాడుతున్న డీవైఎ్‌ఫఐ నాయకులు

కర్నూల న్యూసిటీ, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): కర్నూలు రైల్వే వ్యాగినను వెంటనే పూర్తి చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని డీవైఎ్‌ఫఐ జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర, కార్యదర్శి నగేష్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం డీవైఎ్‌ఫఐ కార్యాలయంలో జనరల్‌ బాడీ సమావేశం మండల కార్యదర్శి ప్రకాస్‌ అధ్యక్షతన నిర్వహించారు. వారు మాట్లాడుతూ పంచలింగాల సమీపంలో రైల్వే వ్యాగిన నిర్మాణం చేసి మండలంలోని యువతకు, ఉద్యోగాలు కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి పది సంవత్సరాలు అవుతుందన్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా నత్తనడకన నడుస్తున్న కర్నూలు రైల్వే వ్యాగిన ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. వెంటనే కర్నూలు రైల్వే వ్యాగిన పూర్తి చేసి యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. సమావేశంలో మండల నాయకులు సురేష్‌, హరికిషన రెడ్డి, వై.శంకర్‌, దివాకర్‌, నాగప్ప, రాజు, సభ్యులు ఎన.రాజు, రాము, దస్తగిరి మహేష్‌, అంజి, హరి పాల్గొన్నారు.

Updated Date - Dec 01 , 2024 | 11:47 PM