Share News

లోటుపాట్లు లేకుండా సాగునీటి సంఘాల ఎన్నికలు జరపండి

ABN , Publish Date - Nov 29 , 2024 | 12:26 AM

సాగునీటి సంఘాల ఎన్నికల్లో లోటుపాట్లు లేకుండా పటిష్టంగా సజావుగా చేపట్టాలని జలవనరుల శాఖ స్పెషల్‌ సీఎస్‌ జి. సాయిప్రసాద్‌ కలెక్టర్లను ఆదేశించారు.

   లోటుపాట్లు లేకుండా సాగునీటి సంఘాల ఎన్నికలు జరపండి
వీడియో కాన్ఫరెన్సలో జిల్లా కలెక్టర్‌ పి.రంజిత బాషా

కర్నూలు కలెక్టరేట్‌ నవంబరు 28, (ఆంధ్రజ్యోతి): సాగునీటి సంఘాల ఎన్నికల్లో లోటుపాట్లు లేకుండా పటిష్టంగా సజావుగా చేపట్టాలని జలవనరుల శాఖ స్పెషల్‌ సీఎస్‌ జి. సాయిప్రసాద్‌ కలెక్టర్లను ఆదేశించారు. గురువారం విజయవాడ కార్యాలయం నుంచి సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణ అంశంపై కలెక్టర్లతో జలవనరుల శాఖ స్పెషల్‌ సీఎస్‌ వీడియో కాన్ఫరెన్స ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా స్పెషల్‌ సీఎస్‌ సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు. సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణపై డివిజన స్థాయిలో శిక్షణా తరగతులు నిర్వహించాలని, సజావుగా ఎన్నికలను నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని స్పెషల్‌ సీఎస్‌ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స అనంతరం కలెక్టర్‌ రంజిత బాషా మాట్లాడుతూ సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. డిసెంబరు 5వ తేదీన నోటిఫికేషన ఇస్తామని తెలిపారు. డిసెంబరు 8వ తేదీన ప్రాదేశిక నియోజకవర్గం వాటర్‌ యూజర్స్‌ అసోసియేషనకు ఎన్నికలు ఉంటాయని, డిసి్ట్రబ్యూటరీ కమిటీలకు 11వ తేదీన ఎన్నికలు, ప్రాజెక్ట్‌ కమిటీలకు 14వ తేదీన ఎన్నికలు ఉంటాయని కలెక్టర్‌ తెలిపారు. ఎన్నికల నిర్వహణకు అధికారుల నియామకం పూర్తి చేశామన్నారు. ఈ కాన్ఫరెన్సలో జాయింట్‌ కలెక్టర్‌ డా.బి. నవ్య, డీఆర్వో సి. వెంకట నారాయణమ్మ, జలవనరుల శాఖ ఎస్‌ఈ బాలచంద్రారెడ్డి, డీఈలు తదితరులు పాల్గొన్నారు.6వ పేజీకి..

Updated Date - Nov 29 , 2024 | 12:26 AM