ప్రభుత్వానికి క్రిటికల్ కేర్ అంబులెన్స్
ABN , Publish Date - Jul 15 , 2024 | 04:14 AM
రాష్ట్ర ప్రభుత్వానికి పర్వతనేని ఫౌండేషన్ క్రిటికల్ కేర్ అంబులెన్స్‌ను అందించింది.
సీఎం చేతుల మీదుగా అందజేసిన పర్వతనేని ఫౌండేషన్
తాడేపల్లి టౌన్, జూలై 14: రాష్ట్ర ప్రభుత్వానికి పర్వతనేని ఫౌండేషన్ క్రిటికల్ కేర్ అంబులెన్స్‌ను అందించింది. పర్వతనేని ఫౌండేషన్-లుగాంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా ఉండవల్లిలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ అంబులెన్స్‌ను ఆదివారం ప్రభుత్వానికి అందజేశారు. కేంద్ర మాజీ మంత్రి పర్వతనేని ఉపేంద్ర 88వ జయంతి సందర్భంగా పర్వతనేని ఫౌండేషన్ నుంచి ఆయన తనయుడు పి.వివేక్ ఆనంద్ అంబులెన్స్‌ను అందించారు. ఫౌండేషన్ కార్యదర్శి వివేక్ ఆనంద్‌ను సీఎం చంద్రబాబు అభినందించారు. టీడీపీ ఆవిర్భావ సమయంలో జనరల్ సెక్రెటరీగా పనిచేసిన ఉపేంద్రతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఉపేంద్ర కుటుంబ సభ్యులు, లుగాంగ్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.