Share News

భక్తిశ్రద్ధలతో దత్తజయంతి వేడుకలు

ABN , Publish Date - Dec 15 , 2024 | 12:04 AM

దత్తజయంతి వేడుకలను నగరంలోని భక్తులు శనివారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.

భక్తిశ్రద్ధలతో దత్తజయంతి వేడుకలు

సాయిబాబా ఆలయంల్లో ప్రత్యేక పూజలు

కర్నూలు కల్చరల్‌, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి) : దత్తజయంతి వేడుకలను నగరంలోని భక్తులు శనివారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నగరంలో వివిధ ప్రాంతాల్లో వెలసిన షిరడీ సాయిబాబా దేవాలయాల్లో బాబావారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పాతనగరంలో దక్షిణ షిరిడీగా వినతికెక్కిన షిరిడీ సాయిబాబా దేవస్థానంలో జరిగిన దత్తజయంతి వేడుక ల్లో భక్తులు హాజరయ్యారు. బాబావారికి ధుని పూజ, సాయి సత్యవ్రతం, మధ్యాహ్న హారతి ఇచ్చారు. సాయంత్రం ధూప్‌ హారతి, రాత్రి పల్లకి సేవ, శేజ్‌ హారతి పట్టారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నగరంలోని సరస్వతినగర్‌లోగల శివదత్త సాయిమందిరంలో దత్తజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకాలు భక్తులచే నిర్వహింపజేశారు. అనంతరం బాబా వారికి ప్రత్యేక అలంకరణ, అర్చనలు, మధ్యాహ్నం హారతి కార్యక్రమాలు చేపట్టారు. సాయంత్రం హారతి, పల్లకి సేవ నిర్వహించారు. సంకల్‌బాగ్‌లోని హరిహర క్షేత్రంలో దత్తజయంతి సందర్భంగా ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. వెంకటరమణ కాలనీలోని సత్యసాయి మందిరం, అశోక్‌నగర్‌లోని ప్రసన్నాంజనేయ స్వామి, ద్వారకామాయి సాయిమందిరంలో దత్త జయంతి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కేసీ కెనాల్‌ వినాయక ఘాట్‌ సమీపంలోని వినాయక మందిరంలోగల సత్యసాయి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. ఎ.క్యాంపులోని ఆదిత్యనగర్‌లోని సాయి సుబ్రహ్మణ్యేశ్వర జ్ఞాన మందిరంలో గురు దత్తజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కొత్తపేటలోని నాగసాయి దేవాలయంలో దత్తాత్రేయ జయంతిని వైభవంగా నిర్వహించారు.

Updated Date - Dec 15 , 2024 | 12:04 AM