Share News

పెద్దనేలటూరులో డెంగీ కేసు నమోదు

ABN , Publish Date - Nov 22 , 2024 | 11:48 PM

మండలంలోని పెద్దనేలటూరు గ్రామంలో డెంగీ కేసు నమోదు అయిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదోని డివిజన మలేరియా అధికారి సాయిబాబా అన్నారు.

పెద్దనేలటూరులో డెంగీ కేసు నమోదు
పెద్దనేలటూరు ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ఎంపీడీవో

గోనెగండ్ల, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): మండలంలోని పెద్దనేలటూరు గ్రామంలో డెంగీ కేసు నమోదు అయిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదోని డివిజన మలేరియా అధికారి సాయిబాబా అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని పెద్దనేలటూరు గ్రామంలో ఆయన, వైద్యశాఖ సిబ్బంది, ఎంపీడీవో మణిమంజరి, ఈవోఆర్‌డీ అనంత శయనా పర్యటించారు. గ్రామంలో నాలుగేళ్ల పిల్లవాడికి డెంగీ సోకడంతో అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. వైద్యశిబిరాలను ఏర్పాటు చేశారు. రోగులకు జ్వరం, దగ్గు, జలుబు, ఇతర వ్యాధులు ఉన్నవారికి మందులను అందజేశారు. 40 రోజులలో మండలంలో ఏడు కేసులు నమోదు అయినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఇళ్ల పరిసరాలలో దోమలు ప్రబలకుండా పెరిత్రియం ద్రావణం పిచికారి చేయించాలని వైద్యసిబ్బందికి సూచించారు. గ్రామంలో ఎవరైనా అనారోగ్యం ఉన్నట్లు తెలిస్తే వెంటనే గోనెగండ్ల ప్రభుత్వ అసుపత్రికి రావాలని వైద్యసిబ్బంది గ్రామస్థులకు సూచించారు. కార్యక్రమంలో ఆశా వర్కర్లు, శాంతమ్మ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Nov 22 , 2024 | 11:48 PM