Share News

Pawan Kalyan: అమరావతికి రైల్వే లైన్‌పై డిప్యూటీ సీఎం పవన్ ఏమన్నారంటే

ABN , Publish Date - Oct 24 , 2024 | 04:33 PM

అమరావతి రైల్వే అనుసంధాన ప్రాజక్టుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలపడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. అమరావతికి కొత్త రైల్వే లైన్ బిగ్ బూస్ట్ అని ఆయన వ్యాఖ్యానించారు.

Pawan Kalyan: అమరావతికి రైల్వే లైన్‌పై డిప్యూటీ సీఎం పవన్ ఏమన్నారంటే
Pawan Kalyan

అమరావతి: అమరావతి రైల్వే అనుసంధాన ప్రాజక్టుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలపడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. కొత్త రైల్వే లైన్ అమరావతికి బిగ్ బూస్ట్ అని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలోని అన్ని నగరాలను కలిపే ఈ ప్రాజెక్టు ఎంతో కీలకమని అన్నారు. ముఖ్యమైన ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.


ఈ ప్రాజెక్ట్ ఏపీకి ఎంతో ఉపయోగకరమని పవన్ విశ్వాసం వ్యక్తం చేశారు. దేశంలోని ఇతర నగరాలను కలపడంతో పాటు హైదరాబాద్‌కు కనెక్టివిటీని పెంచుతుందని ఆయన చెప్పారు. బందరు, కృష్ణపట్నం పోర్టులను కలిపే ఈ కొత్త రైల్వే లైన్ చాలా దూరదృష్టితో ప్రతిపాదించిన ప్రాజెక్ట్ అని ఆయన ప్రస్తావించారు. ఈ మేరకు రైల్వే శాఖ నిర్వహించిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ వర్చువల్‌గా మాట్లాడారు.


సీఎం చంద్రబాబు ఏమన్నారంటే..

మరోవైపు కేంద్ర కేబినెట్ నిర్ణయంపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్ర రాజధానులను కలుపుతూ ఈ రైల్వే లైన్ ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు. నాలుగు సంవత్సరాల్లోనే ఈ ప్రాజెక్టు పూర్తికానుందని, ఈ ప్రాజెక్టుతో పర్యావరణ పరిరక్షణ కూడా జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇతర రైల్వేస్టేషన్లలో జరుగుతున్న అభివృద్ధి పనులను కూడా వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు కోరారు.

కాగా అమరావతి రైల్వే అనుసంధాన ప్రాజక్టుకు కేంద్ర కేబినెట్‌ పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే. మొత్తం రూ.2,245 కోట్ల వ్యయంతో 57 కిలోమీటర్ల మేర రాజధాని అమరావతి కొత్త రైల్వే లైన్‌‌ను నిర్మించనున్నారు. అమరావతి నుంచి హైదరాబాద్‌, చెన్నై, కోల్‌కతాకు నేరుగా అనుసంధానం చేస్తూ నిర్మించనున్నారు. ఈ లైన్‌ ద్వారా దక్షిణ భారతదేశాన్ని మధ్య, ఉత్తరాదితో అనుసంధానం చేయడం మరింత సులువు అవుతుంది.


ఇవి కూడా చదవండి

కృష్ణా నదిపై రైల్వే వంతెనను ఐకానిక్ బ్రిడ్జిగా తీర్చిదిద్దాలి

ఏపీ, బిహార్‌లకు కేంద్రం గుడ్‌న్యూస్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన కేబినెట్

Updated Date - Oct 24 , 2024 | 04:51 PM