Share News

Pawan Kalyan : మాది మంచి ప్రభుత్వం మెతకది కాదు

ABN , Publish Date - Nov 02 , 2024 | 05:42 AM

తమది మంచి ప్రభుత్వమే తప్ప మెతక ప్రభుత్వం కాదని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

Pawan Kalyan : మాది మంచి ప్రభుత్వం మెతకది కాదు
Deputy CM Pawan Kalyan

  • మాది మంచి ప్రభుత్వం.. మెతకది కాదు..

  • వైసీపీ ఇంకా వేషాలేస్తే తొక్కి నారతీస్తా..

  • డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హెచ్చరిక..

  • వాళ్ల సోషల్‌ మీడియా లెక్క తీస్తున్నాం

  • సనాతన ధర్మ పరిరక్షణకే కట్టుబడ్డాం

  • అస్థిరత్వాన్ని ఎన్నటికీ అంగీకరించం

  • సేనలోనూ నరసింహ వారాహి గణం

  • షర్మిల భద్రతపై సీఎంతో మాట్లాడతా

  • ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పంపిణీ కార్యక్రమంలో పవన్‌ కల్యాణ్‌

ఏలూరు, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): తమది మంచి ప్రభుత్వమే తప్ప మెతక ప్రభుత్వం కాదని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐ.ఎ్‌స.జగన్నాఽథపురంలో శుక్రవారం దీపం-2 పథకం కింద గ్యాస్‌ సిలిండర్ల పంపిణీని ఆయన ప్రారంభించారు. అక్కడే జరిగిన సభలో వైసీపీ నేతల తీరుపై నిప్పులు చెరిగారు. ‘‘వైసీపీ నేతలకు చింత చచ్చినా పులుపు చావలేదు. వారికి పదకొండు సీట్లు వచ్చినా విమర్శలు మానలేదు. వైసీపీది తప్పుడు విధానం. ఇప్పటికీ సోషల్‌ మీడియాలో వాళ్ల నోళ్లు ఆగడంలేదు’ అని ఆగ్రహించారు. ఆ పార్టీ సోషల్‌ మీడియాలో వ్యక్తుల మీద, బంధువుల మీద, ఆడ బిడ్డల మీద ఇష్టానుసారం ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రతీది సమయంతో సహా లెక్కిస్తున్నామని, తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనంటూ హెచ్చరిక జారీ చేశారు. ‘‘మీకు (వైసీపీ నేతలను ఉద్దేశించి) యుద్ధమే కావాలి అనుకుంటే మేము సిద్ధమే.. కాని అభివృద్ధికి ఉపయోగపడే యుద్ధం కావాలి. ఆడబిడ్డల మాన ప్రాణాలకు ఆపద కలిగితే తీవ్రంగా పరిగణిస్తాం. నేరాలు పెరిగాయి.. శిక్షలు తగ్గాయి. ఇప్పుడు దీనిపైనే సీరియ్‌సగా ఆలోచిస్తున్నాం. కఠిన శిక్షలకు వీలుగా తగు విధానాన్ని రూపొందించదలిచాం. డిజిటల్‌ ప్రైవసీ యాక్ట్‌ తీసుకురాబోతున్నాం. వైసీపీ సోషల్‌ మీడియాలో వస్తున్న ప్రతీ విషయాన్ని గుర్తిస్తున్నాం. ఏం చేయాలో కూడా త్వరలోనే తేలుస్తాం. ఇంకా తిమ్మిరి తిమ్మిరిగా ఉందా?.. చర్యలు తీసుకునేటప్పుడు వైసీపీ వారు రోడ్డెక్కితే కాళ్లు విరగ్గొట్టి మూలన కూర్చోబెడతాం’’ అంటూ పవన్‌ తీవ్ర స్వరం వినిపించారు.


ఈవీఎంలు అవే కదా..

‘‘మీకేమో 151 సీట్లు వస్తే మంచి అంటారు. అదే 11 సీట్లొస్తే మోసం అంటారు. జరిగిందంతా ఈవీఎంల మోసమేనంటూ ప్రచారం చేస్తారు. డ్రామాలు, మెలోడ్రామాలు ఆడతారు. కేంద్రంలో బీజేపీకి 357 సీట్లు వచ్చాయి కదా. అవికూడా ఈవీఎంల తప్పేనా? కొందరు వైసీపీలో మాత్రం వీటిమీదే పాటలు కడుతున్నారు. ఏదో అన్యాయం జరిగిపోయినట్టు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు, ఉన్నతాధికారులు కొందరు ఇంకా మెతకగా ఉన్నారు. సరిగ్గా పనిచేయడం లేదు. వైసీపీ కాలంలో ‘ఊ’ అంటే ‘ఆ’ అంటూ కదిలేవారు. ధర్మబద్దంగా మేం చెబుతుంటే పనిచేయడంలేదు. పోలీసులకు హనీమూన్‌ అయిపోయింది. సరిగ్గా పనిచేయాల్సిందే’’


షర్మిల భద్రతపై మాట్లాడతా..

‘‘ఆ నాయకుడి సోదరి (షర్మిల పేరు ప్రస్తావించకుండానే) అదనపు రక్షణ కోరుకుంటున్నారు. భద్రత పెంచాలని అడుగుతున్నారు. ఆమె ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు. ఆమె భద్రత విషయం సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తా. ఆమె అన్నలా కాకుండా మేము రక్షణ కల్పిస్తాం’’

gk.jpg

అస్థిరత్వాన్ని సహించం..

‘‘రాష్ట్రంలో, దేశంలో అస్థిరత్వాన్ని సహించబోం. సంఘ విద్రోహ శక్తులు గొడవలు సృష్టిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయి. ఆలయాల్లో అల్లరిచిల్లర మూకలు ఆడపడుచుల పట్ల అనుచితంగా ప్రవర్తించకుండా ఎక్కడికక్కడ భద్రత కల్పించాలి.’’

సనాతన ధర్మానికి కట్టుబడ్డా..

‘‘సనాతన ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉన్నాను. సనాతన ధర్మంపై రకరకాలుగా మాట్లాడుతున్నారు. అన్ని మతాలను నేను గౌరవిస్తా. హిందూ దేవాలయాలకు వెళ్లేటప్పుడు కొన్ని విలువలు పాటించాలి. సనాతన ధర్మం ప్రపంచానికి దిక్సూచిగా జగన్నాథపురంలోనే దీక్ష చేపట్టాను. హైందవ ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని కించపరిచేలా సోషల్‌ మీడియాలో పోస్టులు పెడితే సహించేదిలేదు.’’


సేనలో నరసింహ వారాహి గణం....

‘‘జనసేన అనుబంధ విభాగాలను ప్రారంభించాలని తరచూ కొందరు నన్ను కోరుతున్నారు. ఈ దిశగా కొత్త కార్యాచరణ తీసుకోబోతున్నాను. పార్టీ అనుబంధ సంఘంగా సనాతన ధర్మ పరిరక్షణ విభాగాన్ని ప్రారంభిస్తున్నాను. ఈ విభాగం పేరు నరసింహ వారాహి గణం. ఏపీ, తెలంగాణల్లో ఈ విభాగాన్ని ప్రారంభిస్తున్నాం’’

కారు దిగి.. కొంత దూరం నడిచి... వైసీపీ హయాం రోడ్ల దుస్థితిని పరిశీలించిన పవన్‌

వైసీపీ ప్రభుత్వంలో అధ్వానంగా ఉన్న రోడ్లపై తట్ట మట్టి కూడా వేయలేదని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ విమర్శించారు. శుక్రవారం ఆయన ద్వారకాతిరుమల మండలం ఐఎ్‌స.జగన్నాఽథపురం వెళ్తూ మార్గమధ్యలో కొయ్యలగూడెం మండలం రాజవరంలో రోడ్డు అధ్వానంగా ఉండడంతో ఆయన కారు దిగి కొద్దిదూరం నడిచి వెళ్లారు. ఆ గ్రామంలోని రోడ్లను పరిశీలించారు. ఈ రోడ్డును తక్షణమే నిర్మిస్తామని గ్రామస్థులకు హామీ ఇచ్చారు.


వైసీపీ ఇంకా వేషాలేస్తే తొక్కి నారతీస్తా డిప్యూటీ సీఎం పవన్‌ హెచ్చరిక

‘‘లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా చెబుతున్నా....! వైసీపీ నేతలు నోరెత్తకుండా చేస్తా. సోషల్‌ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తున్నారు. మాది మంచి ప్రభుత్వమే తప్ప మెతక ప్రభుత్వం కాదు. తొక్కి నార తీస్తా. ప్రతిదీ సమయంతో సహా లెక్కిస్తున్నాం. మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే’’


Also Read:

దీపావళి తర్వాత రిలీఫ్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

ఆంధ్రజ్యోతి ఎడిటర్‌గా రాహుల్‌ కుమార్‌

ఈ నెల 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు! జనవరిలో ప్రమాణస్వీకారం! ఎందుకంటే..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Nov 02 , 2024 | 08:09 AM