Home » Deputy CM Pawan Kalyan
కాకినాడ పోర్టులో ‘సీజ్ ద షిప్’ ఆదేశాలతో నిలిచిపోయిన స్టెల్లా నౌక వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. దీనిపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది.
ప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో 30 పడకల కమ్యూనిటీ ఆస్పత్రిని...
రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు జనవరిలో ప్రారంభం కానున్నాయి. రాజధాని నిర్మాణ పనులకు టెండర్లు పిలిచే కార్యక్రమాన్ని మూడు నుంచి వారం రోజుల్లోగా ప్రారంభించి, ఈ నెలాఖరులోగా వీలైనన్ని పూర్తిచేస్తామని మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మధ్య ఆసక్తికర భేటీ జరిగింది.
రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యాటకం, చారిత్రక స్థలాల పర్యాటకం ఉన్న మాదిరిగానే సాహితీ పర్యాటకం కూడా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకులు దొంగబుద్ధితో వ్యవహరించి, దొంగ పనులు చేశారని సీఎం చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రానికి విభజన వల్ల జరిగిన నష్టం కంటే 2019 నుంచి జగన్ పాలనలో జరిగిన నష్టమే ఎక్కువని అభిప్రాయపడ్డారు.
ఒక్కోసారి మంచి చేసినా ఎన్నో ఇబ్బందులు పడాలని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. పొట్టి శ్రీరాములు తాను అనుకున్నది సాధించారని తెలిపారు.
ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు 53 రోజులు ఆమరణ దీక్ష చేసి ప్రాణాలు విడిచారని, కేవలం సమాజం కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం బతికిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని పవన్ కల్యాణ్ కొనియాడారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత పొట్టి శ్రీరాములు గొప్ప తనం అర్థమైందన్నారు. ఆయన విగ్రహం వెతకాలంటే..
అల్లు అర్జున్ అరెస్టు గురించి తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు వచ్చారు. ఆదివారం ఉదయం అల్లు అర్జున్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. సంధ్యా థియేటర్ ఘటన, అరెస్టు గురించి బన్నీ టీమ్‌ని అడిగి వివరాలు తెలుసుకోనున్నారు.
భవిష్యత్తు ఆంధ్రా కోసం పాటుపడే ముఖ్యమంత్రి చంద్రబాబుకు వందేళ్ల ఆయుష్షు ఇవ్వాలని భగవంతుడ్ని కోరుకుంటున్నానని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.