Share News

తిరుమల తరహాలో శ్రీశైలం అభివృద్ధి

ABN , Publish Date - Nov 29 , 2024 | 12:33 AM

శ్రీశైల మహాక్షేత్రాన్ని తిరుమలలా అభివృద్ధి చేసేందుకు సమగ్ర వివరాలతో మాస్టర్‌ ప్లాన సిద్ధం చేయడానికి నివేదికలు ఇవ్వాలని కలెక్టర్‌ రాజకుమారి అధికారులను ఆదేశించారు.

   తిరుమల తరహాలో శ్రీశైలం  అభివృద్ధి
శ్రీశైల క్షేత్ర అభివధ్దికోసం ప్రణాళికలు సిద్దంచేయాలని ఆదేశాలు జారీ చేస్తున్న కలెక్టర్‌ రాజకుమారి

కలెక ్టర్‌ రాజకుమారి

నంద్యాల కల్చరల్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల మహాక్షేత్రాన్ని తిరుమలలా అభివృద్ధి చేసేందుకు సమగ్ర వివరాలతో మాస్టర్‌ ప్లాన సిద్ధం చేయడానికి నివేదికలు ఇవ్వాలని కలెక్టర్‌ రాజకుమారి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్‌ చాంబర్‌లో శ్రీశైల మహాక్షేత్ర అభివృద్ధిపై జాయింట్‌ కలెక్టర్‌ విష్ణుచరణ్‌తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. గతంలో దేవదాయ, అటవీశాఖలు సంయుక్తంగా నిర్వహించిన సర్వే నివేదికలను కూడా పొందుపరచాలని సర్వే లాండ్స్‌ ఏడీని ఆదేశించారు. నందికొట్కూరు రిజర్వ్‌ ఫారెస్ట్‌, వన్యప్రాణుల నిషేదిక భూములు సంబంధిత వివరాలతో నివేదికలు ఇవ్వాలని డీఎఫ్‌ఓను కలెక్టర్‌ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటకరంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్న నేపఽథ్యంలో శ్రీశైల క్షేత్రాన్ని తిరుమల స్ధాయిలో అభివృద్ధి చేసేందుకు మాస్టర్‌ ప్లాన రూపొందించి నివేదికలు పంపాలని గత సోమవారం ఉప ముఖ్యమంత్రి అఽధ్యక్షతన దేవదాయ, పర్యాటక, ఆర్‌అండ్‌బీ మంత్రుల కమిటీ సమావేశంలో నిర్దేశించారన్నారు. ఈ నేపథ్యంలో శ్రీశైల దేవస్ధానం ఆదీనంలో వున్న భూములు, అటవీ సరిహద్దులు నుండి రక్షణగోడలు మొదలైన వాటిపై నివేదకలను అందజేయాలని శ్రీశైల దేవస్థానం ఈవో చంద్రశేఖర అజాద్‌ను కలెక్టర్‌ ఆదేశించారు.

సీసీ రోడ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయండి -కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల కల్చరల్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రారంభించిన సీసీ రోడ్ల నిర్మాణ పనుల పూర్తికి నాలుగు వారాలు మాత్రమే సమయం వుందని నాణ్యత ప్రమాణాలు పాటించి మండలాల వారిగా కేటాయించిన లక్ష్యాన్ని పూర్తిచేయాలని కలెక్టర్‌ రాజకుమారి పంచాయతీరాజ్‌ ఇంజనీర్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని ఎనఐసీ వీడియో కాన్ఫరెన్స హాల్‌ నుండి వీడియో కాన్ఫరెన్స ద్వారా సీసీ రోడ్ల నిర్మాణ పనుల ప్రగతి పై ఇంజనీరింగ్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ రాజకుమారి మాట్లాడుతూ నియోజకవర్గాల వారీగా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 240 రోడ్లకు గాను 41, నంద్యాల నియోజకవర్గంలో 103 రోడ్లకుగాను 27, పాణ్యం నియోజకవర్గంలో 71రోడ్లకు గాను 15, శ్రీశైలం నియోజకవర్గంలో 165 రోడ్లకు గాను 57, బనగానపల్లి నియోజకవర్గంలో 147రోడ్లకు గాను 33, డోన నియోజకవర్గంలో 64రోడ్లకు గాను 27, నందికొట్కూరు నియోజకవర్గంలో 236 రోడ్లకుగాను 55 పూర్తయ్యాయన్నారు. మిగిలిన రోడ్ల నిర్మాణాలను డిసెంబర్‌ చివరి నాటికి పూర్తి చేయాలని ఏఈ, డీఈలను కలెక్టర్‌ ఆదేశించారు. నిర్దేశించిన రోడ్ల నిర్మాణాలను గడువులోగా పూర్తిచేయాలని కలెక్టర్‌ ఆదేశించారు.

Updated Date - Nov 29 , 2024 | 12:33 AM