Devotees: శ్రీవారి సర్వదర్శనానికి 36 గంటలు
ABN , Publish Date - Jun 16 , 2024 | 04:11 AM
వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య శనివారం మధ్యాహ్నం నుంచి పెరిగింది. సాయంత్రానికి శ్రీవారి ఆలయంతో పాటు మాడవీధులు, అఖిలాండం, అన్నప్రసాద భవనం, లడ్డూ వితరణ కేంద్రం, బస్టాండ్ ప్రాంతాల్లో రద్దీ భారీగా నెలకొంది.
తిరుమల, జూన్ 15(ఆంధ్రజ్యోతి): వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య శనివారం మధ్యాహ్నం నుంచి పెరిగింది. సాయంత్రానికి శ్రీవారి ఆలయంతో పాటు మాడవీధులు, అఖిలాండం, అన్నప్రసాద భవనం, లడ్డూ వితరణ కేంద్రం, బస్టాండ్ ప్రాంతాల్లో రద్దీ భారీగా నెలకొంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరిషెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ రింగురోడ్డులో అక్టోపస్ భవనం వరకు దాదాపు 3కిలోమీటర్ల మేర వ్యాపించింది. వీరికి 36 గంటల దర్శన సమయం పడుతున్నట్టు టీటీడీ ప్రకటించింది. రద్దీ కారణంగా గదులకు డిమాండ్ నెలకొంది. సీఆర్వో, ఎంబీసీ, పద్మావతి, ఏఆర్పీ, టీబీ కౌంటర్లు కిటకిటలాడుతున్నాయి. గది పొందేందుకు 3 నుంచి 4 గంటల సమయం పడుతోంది. కల్యాణకట్టలు కూడా రద్దీగా కన్పిస్తున్నాయి. సోమవారం వరకు సెలవులున్న నేపథ్యంలో మంగళవారం వరకు రద్దీ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.