Home » Tirumala
టీటీడీ పాలక మండలి పలు సంచలన నిర్ణయాలను తీసుకుంది. దీనిపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టీటీడీ బోర్డు భక్తుల కోసం చాలా మంచి నిర్ణయాలు తీసుకుందని కిషన్రెడ్డి తెలిపారు.
తిరుమల శ్రీవేంకటేశ్వరుడిని 2-3 గంటల్లోనే దర్శించుకునేలా చర్యలు తీసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) నూతన ధర్మకర్తల మండలి నిర్ణయించింది.
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సోమవారం తిరుమలలో సమావేశమైంది. ఈ సందర్భంగా పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో ఒకటైన తిరుపతి ప్రజలకు.. శ్రీవారిని దర్శించేందుకు ప్రతి నెలలో ఒక రోజు కేటాయించేందుకు టీటీడీ సుముఖత వ్యక్తం చేసింది.
తిరుమల డంపింగ్ యార్డులోని చెత్తను మూడు నెలల్లో క్లియర్ చేయాలని టీటీడీ నిర్ణయించింది. శ్రీనివాససేతు పేరుని గరుడ వారధిగా మార్పు చేస్తున్నట్లు ప్రకటించింది.
తిరుమల శ్రీవారిని ఆదివారం ఏపీ, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ హరినాథ్, జస్టిస్ వినోద్ కుమార్ దర్శించుకున్నారు.
తిరుమలలో అన్యమత ప్రచారం కలకలం రేపుతోంది. పాప వినాశనం వద్ద ఓ వర్గం వారు తమ మతం గురించి ప్రచారం చేశారనే వదంతులు ఊపందుకున్నాయి. పాప వినాశనంలో 20మందికి పైగా అన్యమతస్తులు పాటలతో రీల్స్ చేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
తిరుమల శ్రీవారి ఆలయంలో కొలువైన శ్రీ భాష్యకార రామానుజాచార్యులకు వజ్రాలు పొదిగిన బంగారు హారాన్ని విగ్రహాల రూపశిల్పి డీఎన్వీ ప్రసాద్ స్థపతి సమర్పించారు.
అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం సికింద్రాబాదు, మచిలీపట్నం నుంచి కొల్లం మధ్య శబరిమలైకి ఈనెల 18 నుంచి నాలుగు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్(CPRO Sridhar) ఒక ప్రకటనలో తెలిపారు.
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చారు.
పుష్పయాగం సందర్భంగా రెండో అర్చన, రెండో గంట, నైవేద్యాలను స్వామివారికి సమర్పించనున్నారు. అనంతరం శ్రీ మలయప్ప స్వామిని ఆలయ మాడవీధుల్లో ఊరిగేస్తారు.