Share News

శిలలను శిల్పాలుగా మార్చిన అధ్యాపకులు

ABN , Publish Date - Nov 21 , 2024 | 03:44 AM

గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన ఎంతోమందికి చదువుతో పాటు సంస్కారం నేర్పించారు..

శిలలను శిల్పాలుగా మార్చిన అధ్యాపకులు

జేకేసీ పూర్వ విద్యార్థినని చెప్పుకోవడానికి గర్వపడతా: డీజీపీ

రూ.2.50 కోట్లతో ఆధునికీకరించిన ఆడిటోరియం ప్రారంభం

గుంటూరు(విద్య), నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): ‘‘గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన ఎంతోమందికి చదువుతో పాటు సంస్కారం నేర్పించారు.. ఆకృతిలేని రాళ్లలాంటి మాలాంటి ఎంతోమందిని శిల్పాలుగా తీర్చిదిద్దారు.. ఆ ఘనత గుంటూరులోని జేకేసీ కళాశాల అధ్యాపకులదే’’ అని డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. గుంటూరులోని జేకేసీ కళాశాలలో పూర్వ విద్యార్థుల సహకారంతో నూతనంగా రూ.2.50 కోట్లతో ఆఽధునీకరించిన జాగర్లమూడి లక్ష్మయ్యచౌదరి ఆడిటోరియాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ.. నాలుగున్నర దశాబ్దాల క్రితం జేకేసీ కళాశాలలో చదువుకున్నానని.. ఇక్కడ నేర్పిన చదువు, క్రమశిక్షణ కారణంగానే నేషనల్‌ పోలీసు అకాడమిలో చేరినట్టు తెలిపారు. ఇక్కడ చదివిన ఎంతోమంది ఐఏఎస్‌, ఐపీఎ్‌సలుగా తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్నారన్నారు. ఏ రంగంలో ఉన్నా జేకేసీ కళాశాల పూర్వ విద్యార్థిగా చెప్పుకోవడానికి గర్వపడతామన్నారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తాను ఇక్కడ నేర్పిన క్రమశిక్షణ, అంకితభావంతోనే రాజకీయాల్లో రాణిస్తున్నానని వినుకొండ ఎమ్మెల్యే, రాష్ట్ర చీఫ్‌ విప్‌ జీవీ ఆంజనేయులు అన్నారు. జేకేసీ కళాశాలలో చదువుకున్న విద్యార్థులు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉన్నతస్థానాల్లో ఉన్నారని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ మన్నవ మోహనకృష్ణ తెలిపారు.

Updated Date - Nov 21 , 2024 | 03:46 AM