Share News

రైతుసేవా కేంద్రాల్లో రాయితీ వరి విత్తనాల పంపిణీ

ABN , Publish Date - Aug 05 , 2024 | 03:50 AM

ఇటీవల అధిక వర్షాలకు వరినారు, నారుమళ్లు నష్టపోయిన రైతులకు 80ు రాయితీపై వరి విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అనకాపల్లి, తూర్పుగోదావరి, కాకినాడ, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో వర్షాలకు 1,406 హెక్టార్లలో నారుమళ్లు, 33వే

రైతుసేవా కేంద్రాల్లో రాయితీ వరి విత్తనాల పంపిణీ

అమరావతి, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): ఇటీవల అధిక వర్షాలకు వరినారు, నారుమళ్లు నష్టపోయిన రైతులకు 80ు రాయితీపై వరి విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అనకాపల్లి, తూర్పుగోదావరి, కాకినాడ, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో వర్షాలకు 1,406 హెక్టార్లలో నారుమళ్లు, 33వేల హెక్టార్లలో వరినారుమళ్లు దెబ్బతిన్నాయన్నారు. ఈ విధంగా నష్టపోయిన రైతుల కోసం 6,356 క్వింటాళ్ల వరి విత్తనాలను సిద్ధం చేసినట్లు తెలిపారు. బాధిత రైతులు స్థానిక రైతు సేవా కేంద్రాల ద్వారా రాయితీ వరి విత్తనాలు పొందాలని ఆదివారం ఓ ప్రకటనలో కోరారు.

Updated Date - Aug 05 , 2024 | 03:50 AM