Share News

బె దిరించడం వైసీపీకే చెల్లు

ABN , Publish Date - Jul 27 , 2024 | 12:10 AM

ప్రజలను బెదిరించడం, దాడులు చేయడం వైసీపీకే చెల్లుతుందని చిలమత్తూరు మండలం టీడీపీ మండల కన్వీనర్‌ రంగారెడ్డి, నాయకులు అన్నారు. శుక్రవారం కొడికొండ చెక్‌పోస్టులో నాయకులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రెండు రోజుల క్రితం చిలమత్తూరు మండల సర్వసభ్య సమావేశాన్ని టీడీపీ నాయకులు అడ్డుకున్నారని, ము

బె దిరించడం వైసీపీకే చెల్లు

మండల సమావేశాన్ని అడ్డుకోవాల్సిన అవసరం లేదు: టీడీపీ

హిందూపురం, జూలై 26: ప్రజలను బెదిరించడం, దాడులు చేయడం వైసీపీకే చెల్లుతుందని చిలమత్తూరు మండలం టీడీపీ మండల కన్వీనర్‌ రంగారెడ్డి, నాయకులు అన్నారు. శుక్రవారం కొడికొండ చెక్‌పోస్టులో నాయకులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రెండు రోజుల క్రితం చిలమత్తూరు మండల సర్వసభ్య సమావేశాన్ని టీడీపీ నాయకులు అడ్డుకున్నారని, ముఖ్యంగా టీడీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ శ్రీనివాసరావుపై చిలమత్తూరు వైసీపీకి చెందిన పురుషోత్తంరెడ్డి ఆరోపణలు చేయడం సిగ్గు చేటన్నారు. గత ఐదేళ్లలో వైసీపీ దాడులు, బెదిరింపులు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందేనన్నారు. పోలింగ్‌ రోజు ఎంపీపీ పురుషోత్తంరెడ్డి అనుచరులను వెంటబెట్టుకుని పోలింగ్‌ బూతలో వీరంగం సృష్టించారు. టీడీపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, శనివారం జరిగే మండల సర్వసభ్య సమావేశాన్ని అడ్డుకుంటామని వైసీపీ నాయకులు చెప్పడం హేయమైన చర్య అన్నారు. ప్రజలు సమస్యలు పరిష్కరించాలని కోరేందుకు ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చామే తప్ప మిమ్మల్ని అడ్డుకోవడానికి కాదన్నారు. అయితే జిల్లా ఉన్నతాధికారులకు లేనిపోని ఫిర్యాదులు చేయడం మానుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దేమకేతేపల్లి అంజినప్ప, నందీశ, బాలాజీ, గౌరీశంకర్‌, నాగరాజు, సోమశేఖర్‌, అశ్వర్థప్ప, తిప్పారెడ్డి, బేకరి గంగాధర్‌, లక్ష్మీనరసప్ప, నాగరాజు, చౌడప్ప పాల్గొన్నారు.

Updated Date - Jul 27 , 2024 | 12:10 AM