Share News

డ్రైనేజీ వ్యవస్థను సమన్వయంతో నిర్వహించాలి

ABN , Publish Date - Dec 15 , 2024 | 12:02 AM

నగర పాలక ఆయా విభాగాల అధికారులు, డ్రైనేజీ వ్యవస్థను సమన్వయంతో నిర్వహించాలని తద్వారా సంతృప్తికరమైన సత్ఫలితాలు పొందవచ్చని న గర పాలక కమిషనర్‌ ఎస్‌. రవీంద్రబాబు అన్నారు.

డ్రైనేజీ వ్యవస్థను సమన్వయంతో నిర్వహించాలి
డ్రైనేజీని పరిశీలిస్తున్న కమిషనర్‌

కమిషనర్‌ రవీంద్రబాబు

కర్నూలు న్యూసిటీ, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): నగర పాలక ఆయా విభాగాల అధికారులు, డ్రైనేజీ వ్యవస్థను సమన్వయంతో నిర్వహించాలని తద్వారా సంతృప్తికరమైన సత్ఫలితాలు పొందవచ్చని న గర పాలక కమిషనర్‌ ఎస్‌. రవీంద్రబాబు అన్నారు. శనివారం ఉల్చాల రహదారిలోని నాగేంద్రనగర్‌, సిద్ధార్థ, అపూర్వ హోమ్స్‌, వై. జంక్షన తదితర ప్రాంతాల్లో కమిషనర్‌ అధికారులతో కలిసి పర్యటించారు. పలు కాలనీల్లో మురుగు కాలువలకు ప్రతిపాదనలు రూపొందించాలని కమిషనర్‌ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ప్రజారోగ్యధికారి డా.కే. విశ్వేశ్వరరెడ్డి, డీఈఈ క్రిష్ణలత, టౌన ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌ ఆంజాద్‌బాషా, ఏఈ భానుప్రతాప్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 15 , 2024 | 12:02 AM