దుద్దకుంటా.. నిజాలు తెలుసుకో.. !
ABN , Publish Date - Nov 20 , 2024 | 11:19 PM
మాజీ ఎమ్మెల్యే దుద్దకుంట శ్రీధర్‌రెడ్డి నిజానిజాలు తెలుసుకుని సామాజిక మాద్య మాల్లో పోస్టులు పెడితే బాగుంటుందని టీడీపీ నాయకులు హితవుపలికారు.
కొత్తచెరువు, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి) : మాజీ ఎమ్మెల్యే దుద్దకుంట శ్రీధర్‌రెడ్డి నిజానిజాలు తెలుసుకుని సామాజిక మాద్య మాల్లో పోస్టులు పెడితే బాగుంటుందని టీడీపీ నాయకులు హితవుపలికారు. బుధవా రం స్థానిక లక్ష్మీ థియేటర్ ప్రాంగణంలో వారు మాట్లాడారు. నెహ్రునగర్ కాలనీకి సీసీ రోడ్డు మంజూరైందని, సీసీ రోడ్డు వేయడానికి పది రోజుల నుంచి అడ్డంకులను తొలగిం చడం జరుగుతోందని అన్నారు. ఇందులో భాగంగా ఓ మహిళ రోడ్డుకు నాలుగు అడుగులు ముందుకు వచ్చి మెటికలు నిర్మించుకుందని, వాటిని తొలగించాలని పది రోజుల నుంచి సూచిస్తున్నామని అన్నారు. వాటిని తొలగించకపోవడంతో రోడ్డు వేయడా నికి ఇబ్బందిగా ఉందని ఆమెకు నచ్చచెప్ప డానికి టీడీపీ, వైసీపీ నాయకులు వెళ్లార న్నారు. అయితే ఆమె బూతులు తిడుతూ నాయకులపైకి గొడవకు వచ్చిందన్నారు. తమ నాయకుడు సాలక్కగారి శ్రీనివాసుల పంచెను లాగగా.. ఆమె నుంచి ఆయన పంచెను విడిపించుకోవడానికి ప్రయత్నించాడే తప్పా కొట్టలేదని అని అన్నారు.
అయితే వాస్తవాన్ని దాచి.. తమ నాయకుడు కొట్టారంటూ మాజీ ఎమ్మెల్యే తన ఫేస్ బుక్‌లో పోస్టు పెట్టడం ఆయన నీచ బుద్ధికి నిదర్శనమన్నారు. మాజీ ఎమ్మెల్యే అక్కడికి వచ్చిన వైసీపీ నాయకు లను అడిగి తెలుసుకుని ప్రవర్తిస్తే బాగుం టుందని.. లేకపోతే ప్రజల్లో అబాసు పాలవు తారని అన్నారు. ఓటమితో అతని మైండ్ బ్లాక్ అయిందని, దీంతో ఇలాంటి పోస్టులు పెడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నా రని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శీన, కిరణ్, సాయి, రాహల్, నరేం ద్ర, వెంకటే శ, లక్ష్మీనారాయణరెడి,్డ శేషంపల్లి పెద్దన్న, బోయ వెంకటనారాయణ పాల్గొన్నారు.