వైద్య,ఆరోగ్య శాఖ ఫ్లడ్ యాక్షన్ ప్లాన్
ABN , Publish Date - Sep 05 , 2024 | 01:26 AM
భారీ వర్షాలు, వరదలు, తుఫాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ముందస్తు ఫ్లడ్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ఈ మేరకు బుధవారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి (డీఎంఅండ్‌హెచ్‌వో) డాక్టర్ కె.వెంకటేశ్వరరావు జిల్లాలో మెడికల్ ఆఫీసర్లకు పలు ఆదేశాలు జారీచేశారు.
రాజమహేంద్రవరం అర్బన్, సెప్టెంబరు 4: భారీ వర్షాలు, వరదలు, తుఫాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ముందస్తు ఫ్లడ్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ఈ మేరకు బుధవారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి (డీఎంఅండ్‌హెచ్‌వో) డాక్టర్ కె.వెంకటేశ్వరరావు జిల్లాలో మెడికల్ ఆఫీసర్లకు పలు ఆదేశాలు జారీచేశారు. వరదలు, తుఫాన్లు సంభవిస్తే వాటి తీవ్రతను తగ్గించేలా, వ్యాఽధులు ప్రబలకుండా, మరణాలు జరగకుండా చూడాలని ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లోని వైద్య బృందాలన్నీ పూర్తి అప్రమత్తంగా ఉండాలని, ఎమర్జన్సీ పరిస్థితుల్లో వైద్య, ఆరోగ్య సిబ్బంది ఎవరికీ సెలవులు ఇవ్వొద్దని ఆయన స్పష్టం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో 24/7 మెడికల్ క్యాంపులు నిర్వహించాలని, మందులు సిద్ధంగా ఉంచుకోవాలని, క్లోరినేషన్ ప్రక్రియ చేపట్టాలని ఆ సర్క్యులర్‌లో పేర్కొన్నారు. కాగా జిల్లాలో ఆరు గ్రామాల్లో ఇప్పటికే మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని, మెడికల్ ఆఫీసర్లకు ఇచ్చిన ఆదేశాలను అమలయ్యేలా సంబంధి త అధికారులు పర్యవేక్షించాలని ఆయన స్పష్టంచేశారు.