Home » Andhra Pradesh » East Godavari
కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ గేట్ వద్ద గంజాయి స్మగ్లర్లు దారుణానికి తెగించారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి పోలీసులు తనిఖీలు చేస్తుండగా వారిని కారుతో ఢీకొట్టారు. అనంతరం అక్కడ్నుంచి పరారయ్యారు.
ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ వాడకాన్ని అలవాటు గా చేసుకోవాలని కొత్తపేట డీఎస్పీ వై.గోవిందరావు పేర్కొన్నారు.
దశావతార ఉత్సవాలను పురస్కరించుకుని బుధవారం రాయవరం శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి బుద్ధ్దావతారంలో పూజలందుకున్నారు.
ధనుర్మాసం సందర్భంగా నూతన సంవత్స రాన్ని పురస్కరించుకుని చింతలూరు నూకాంబికా అమ్మవారి ఆలయంలో లక్షతులసి పూజ నిర్వహించారు.
తూర్పు తిరుమల గా పేరొందిన బలభద్రపురం శ్రీదేవి, భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వరస్వామి ద్వితీయ బ్రహ్మోత్సవాలు బుధవారం తొమ్మిదవ రోజుకు చేరాయి. ఉదయం సుప్రభాత సేవతో కార్యక్రమాలు ప్రారంభించి సహస్ర కలశాభిషేకం, సుగంధ పుష్పాభిషేకం, మార్గ శీర్ష వ్రతం కార్యక్రమాలు జరిపారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లాలో 2024 డిసెంబరు 31తో ముగిసిన జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల కాలపరిమితి జనవరి 1 నుం చి ఫిబ్రవరి 28వ తేదీ వరకు రెండు నెలలపాటు పొడిగిస్తున్నామని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్సీల జనాభా గణనపై సోషల్ ఆడిట్ పూర్తి చేయడానికి గడువును పొడిగించినట్టు ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి ఎం.శోభారాణి తెలిపారు.
కొత్త సంవత్సరంలో రాష్ట్ర అభివృద్ధికోసం కలసి కట్టుగా పనిచేసి సరికొత్త ఆంధ్రప్రదేశ్ను నిర్మించుకుందామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృ తిక సినిమాటోగ్రఫీశాఖా మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.
ఆత్రేయపురం, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం నూతన సంవత్సర వేళ భక్తజనంతో కిటకిటలాడింది. బుధవారం వేకువజామునే స్వామివారికి గోదావరి జలాలతో అభిషేకం, తిరుప్పావై సేవా కాలం నిర్వహించి భక్తులకు దర్శనాలకు అనుమతించారు. నూతన సంవత్సరానికి స్వా
అన్నవరం, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): కాకి నాడ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధిలో బుధవారం నూతన ఆంగ్ల సంవత్సరం పురస్కరించుకుని