Share News

రాష్ట్ర స్థాయి పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక

ABN , Publish Date - Aug 29 , 2024 | 01:10 AM

సెప్టెంబరులో జరిగే రాష్ట్రస్థాయి పవర్‌లిఫ్టింగ్‌ పోటీలకు జిల్లా జట్టును ఎంపిక చేసినట్టు సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌, సభ్యులు మట్టపర్తి సముద్రం, డీఆర్కే నాగేశ్వరరావు, జి.గణేష్‌బాబు, కత్తుల శ్రీనివాసరావు, పి.రత్నకుమారి, సీహెచ్‌రాజబాబు బుధవారం తెలిపారు.

రాష్ట్ర స్థాయి పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక

సెప్టెంబరు 14,15తేదీల్లో రాష్ట్రస్థాయి పోటీ

అమలాపురం టౌన్‌, ఆగస్టు 28: సెప్టెంబరులో జరిగే రాష్ట్రస్థాయి పవర్‌లిఫ్టింగ్‌ పోటీలకు జిల్లా జట్టును ఎంపిక చేసినట్టు సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌, సభ్యులు మట్టపర్తి సముద్రం, డీఆర్కే నాగేశ్వరరావు, జి.గణేష్‌బాబు, కత్తుల శ్రీనివాసరావు, పి.రత్నకుమారి, సీహెచ్‌రాజబాబు బుధవారం తెలిపారు. అమలాపురం హెల్త్‌ అండ్‌ ఫిట్‌నెస్‌ జిమ్‌లో మెన్‌ అండ్‌ ఉమెన్‌ విభాగాల్లో సబ్‌జూనియర్‌, జూనియర్‌, సీనియర్స్‌, మాస్టర్స్‌ విభాగాల్లో జట్లను ఎంపిక చేశారు. జిల్లా నలుమూలల నుంచి 70మంది క్రీడాకారులు హాజరుకాగా వారిలో 30 మందిని జిల్లా జట్లుగా ఎంపిక చేసినట్టు కోచ్‌ కంకిపాటి వెంకటేశ్వరరావు తెలిపారు. ఈజట్టు సెప్టెంబరు 14,15తేదీల్లో అమలాపురంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటుందని జిల్లా పవర్‌లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు యెనుముల కృష్ణపద్మరాజు తెలిపారు. కార్యదర్శి వంటెద్దు వెంకన్నాయుడు, జట్ల ఎంపికకు సహకరించిన పీఈటీ వి.బుజ్జి, జాతీయస్థాయి పవర్‌ లిఫ్టర్లు ఎం.వీరేంద్ర, పి.వందన, బి.అప్పన్న, బి.యశ్వంత్‌ పాల్గొని క్రీడాకారులను అభినందించారు.

Updated Date - Aug 29 , 2024 | 01:10 AM