Share News

కన్నీళ్ల..తాడిమళ్ల

ABN , Publish Date - Sep 12 , 2024 | 01:21 AM

తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమళ్లలో సుమారు 100 వరకూ జీడిపిక్కల ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈ గ్రామంతోపాటు చుట్టుపక్కల వాళ్లకు ఇదే ప్రధాన జీవనా ధారం. మహిళలు కూడా ఇంటివద్ద జీడిపప్పును వలుస్తూ పెద్ద సంఖ్యలో ఉపాధి పొందుతుంటారు. ఫ్యాక్టరీలకు అవ సరమైన జీడిమామిడి పిక్కలను వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి తరలిస్తారు. జీడిపిక్కలను బస్తాల్లో పట్టడం, ఎగు మతి, దిగుమతికి జట్టు కూలీలు అవసరం. దీంతో తాడి మళ్ల చుట్టు పక్కల ప్రాంతాల్లోని మగవాళ్లు ఈ పనులకు వెళ్తారు.

కన్నీళ్ల..తాడిమళ్ల
చిన్నాయిగూడెం వద్ద వ్యాన్‌ ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాలు.

జీడిమామిడి పిక్కల కింద చితికిన కూలి బతుకులు..

నలుగురు సురక్షితం

రాజమహేంద్రవరం, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): తూ ర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమళ్లలో సుమారు 100 వరకూ జీడిపిక్కల ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈ గ్రామంతోపాటు చుట్టుపక్కల వాళ్లకు ఇదే ప్రధాన జీవనా ధారం. మహిళలు కూడా ఇంటివద్ద జీడిపప్పును వలుస్తూ పెద్ద సంఖ్యలో ఉపాధి పొందుతుంటారు. ఫ్యాక్టరీలకు అవ సరమైన జీడిమామిడి పిక్కలను వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి తరలిస్తారు. జీడిపిక్కలను బస్తాల్లో పట్టడం, ఎగు మతి, దిగుమతికి జట్టు కూలీలు అవసరం. దీంతో తాడి మళ్ల చుట్టు పక్కల ప్రాంతాల్లోని మగవాళ్లు ఈ పనులకు వెళ్తారు. పైగా ఈమధ్య వర్షాల వల్ల వ్యవసాయ పనులు లేకపోవడంతో జీడిపిక్కల పనులపైనే ఎక్కువగా ఆధారప డ్డారు. ఈ క్రమంలో కత్తవ కృష్ణ (మేస్త్రి-40) ఆధ్వర్యంలో కత్తవ నారాయుడు(45), తాడి రామకృష్ణ (45), తమ్మిరెడ్డి సత్యనారాయణ (44), దేశాల వీర వెంకటరావు (బూర య్య-40), బొక్కా ప్రసాద్‌ (35), పెనుగుర్తి చినముసలయ్య (35) జట్టుగా మంగళవారం ఉదయం 8 గంటల ప్రాం తంలో డీసీఎం వ్యానులో బయలుదేరి ఏలూరు జిల్లా టి. నర్సాపురం మండలంలోని బొర్రంపాలెం వెళ్లారు. జీడిపిక్క లను బస్తాల్లోకి ఎత్తి ఎగుమతి చేసుకొని అక్కడి నుంచి రాత్రి బయలుదేరారు. దేవరపల్లి మండలం చిన్నాయిగూ డెం దగ్గరలోని చిలకవారిపాకలు(పట్టాభిపురం) వద్ద 11.30 గంటల సమయంలో అదుపుతప్పి రోడ్డు పక్కకు బోల్తా ప డింది.


సాధారణంగా జట్టు కూలీలు లోడుపైనే నిద్రిస్తారు. మృత్యువాత పడిన ఏడుగురు, ప్రాణాలతో బయ టపడిన గంటా మధు జీడిపిక్కల లోడుపై పడు కున్నారు. క్యాబినులో మరో జట్టు కూలీ లోయ ఇమ్మానుయెల్‌రాజు, డ్రైవరు మాపటి శివాజీ కుమార్‌, క్లీనరు గంటి కిషోర్‌కుమార్‌ ఉన్నారు. వ్యాను కుదుపుల్లో జీడిపిక్కల బస్తాలపై నుంచి నిద్రిస్తున్న సమయంలో కింద పడిపోకుండా లో డుపైన ఓ రెండు వరుసలు జీడిపిక్కల బస్తాల ను డొప్పలా వేసి మధ్యలో కూలీలు పడుకుం టారు. ఇదే స్థలంలో ఈ ఎనిమిది మంది నిద్రిం చారు. వ్యాను తాడిమళ్లకు సుమారు 15 కిలోమీ టర్ల దూరంగా ఉండగా చిలకవారిపాకల వద్ద మలుపు తిరిగింది. కొద్ది దూరంలో కుడి వైపున గొయ్యి ఉండడంతో వ్యానును డ్రైవరు కాస్త ఎడమవైపునకు తిప్పాడు. రోడ్డు పక్కన కేవలం అరడుగు వెడల్పుతో గ్రావెల్‌ బెర్మ్‌ ఉంది. వర్షాలు అది లూజుగా తయారైంది. దీంతో వ్యాను టైర్లు ఈ బెర్ముపైకి ఎక్కగానే జారిపోయింది. తుప్పలతో నిండిపోయి చిన్న లోయలోకి పూర్తిగా బోల్తా పడింది. దీంతో లోడుపై పడుకున్న వాళ్లు 15 టన్నుల లోడు బస్తాల కింద నలిగి పోయారు.


ఈ వ్యానుకు ముందు వెళుతున్న వీళ్లకు చెంది న వ్యానులో ఫ్యాక్టరీ యజమాని మనిషి నక్కాకుల నాగ బాబు మరో నలుగురు జట్టు కూలీలు ఉన్నారు. ప్రమాదా నికి గురైన వ్యాను క్యాబిన్‌లోని ఇమ్మాన్యుయేల్‌, డ్రైవరు, క్లీనరు బయటకురాగా.. డ్రైవరు, క్లీనరు భయంతో పారిపో యారు. ఇమ్మాన్యుయేల్‌ ముందు వెళ్లిన వ్యానులోకి వారికి ఫోన్‌చేశాడు. దీంతో వాళ్లు, స్థానికులు వచ్చి బస్తాలు తీయ డానికి శ్రమించారు. సుమారు 2 గంటలపాటు ప్రయత్నిం చి 8 మందినీ బయటకు తీశారు. ఈలోపు ఊపిరాడక ఏడుగురు దుర్మరణం చెందారు.


లోడుపై పడుకున్న ఎని మిది మందిలో గంటా మధు ప్రాణాలతో బయటపడ్డాడు. మృతుల్లో ఆరుగురిది నిడదవోలు మండలం తాడిమళ్లకాగా, బొక్కా ప్రసాద్‌(40)ది మండలంలోని ఉనకరమిల్లి గ్రామం. ఈ ప్రమాదంలో మృతి చెందినవారు అతిపేదవాళ్లు. మగ వాళ్లు జీడిపిక్కలు, వ్యవసాయ కూలీ పనులకు వెళ్తుండగా.. ఆడవాళ్లు కొందరు జీడిపిక్క ఒలుపు చేస్తుంటారు. ఇందులో కత్తవ కృష్ణ, కత్తవ నారాయుడు వరుసకు సోదరులు, ఒకే ఇంట్లో వేర్వేరు పోర్షన్లలో ఉంటున్నారు. వీరు దేశాల వీర వెంకట్రావు ఒకే వీధిలో ఉంటారు. అలాగే.. మృతుల్లో బొక్కా ప్రసాద్‌ది ఉనకర మిల్లి కాగా డ్రైవరు, క్లీనరుతోసహా అందరిదీ తాడిమళ్లే.


ఇవి కూడా చదవండి...

Konda Surekha: రైతు భరోసాపై మంత్రి కొండా సురేఖ ఏమన్నారంటే?

KTR: వాళ్ల మెప్పు కోసమే రాజీవ్ విగ్రహ స్థాపన

Read LatestTelangana NewsAndTelugu News

Updated Date - Sep 17 , 2024 | 01:25 PM