విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు
ABN , Publish Date - Nov 09 , 2024 | 12:01 AM
విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) అధ్యక్షుడు శృంగవరపు నిరంజన పేర్కొన్నారు.
తానా అధ్యక్షుడు శృంగవరపు నిరంజన
రాజనగరంలో సైకిళ్లు, కుట్టుమిషన్ల పంపిణీ
శిరివెళ్ల, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) అధ్యక్షుడు శృంగవరపు నిరంజన పేర్కొన్నారు. శనివారం శిరివెళ్ల మండలం రాజనగరం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆయన విద్యార్థులకు సైకిళ్లు, మహిళలకు కుట్టుమిషన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిరంజన మాట్లాడుతూ తానా ఆధ్వర్యంలో తెలుగు రాషా్ట్రల్లో మహిళల ఆర్థికాభివృద్ధికి, ప్రజలకు విద్య, వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. రాజనగరం గ్రామాభివృద్ధికి ఎళ్లవేళలా ముందుంటామని అన్నారు. నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ నిరంజన అమెరికాలో స్థిరపడి ఉన్నతస్థానానికి వెళ్లి పుట్టిపెరిగిన గ్రామంలో సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. ఆయన్ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అనంతరం నిరంజన తల్లి శృంగవరపు ఇంద్రావతి జ్ఙాపకార్థం తానా ఫౌండేషన ఆధ్వర్యంలో వంద మంది విద్యార్థులకు సైకిళ్లు, యాభై మంది మహిళలకు కుట్టుమిషన్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో శృంగవరపు సుబ్రమణ్యేశ్వరరావు, వేణు వరప్రసాద్, విజయ్ కుమార్, మాలపాటి పుల్లయ్య చౌదరి, టీడీపీ మండల కన్వీనర్ కాటంరెడ్డి శ్రీకాంతరెడ్డి, కుందూరు మోహనరెడ్డి, ఎస్‌పీ లాల్, కొండలరావు, సుబ్బారావు పాల్గొన్నారు.