Share News

ఏలేరు ముంపు ప్రజల్ని అప్రమత్తం చేయాలి

ABN , Publish Date - Sep 05 , 2024 | 03:32 AM

ఏలేరు జలాశయానికి వరద ముప్పు పొంచి ఉన్నందున ముంపునకు గురయ్యే గ్రామల ప్రజలను అప్రమత్తం చేయాలని ఉప మఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అధికారులను ఆదేశించారు.

ఏలేరు ముంపు ప్రజల్ని అప్రమత్తం చేయాలి

  • ఆహారం, నీరు, మందులు ఇవ్వండి: పవన్‌

ఏలేరు జలాశయానికి వరద ముప్పు పొంచి ఉన్నందున ముంపునకు గురయ్యే గ్రామల ప్రజలను అప్రమత్తం చేయాలని ఉప మఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అధికారులను ఆదేశించారు. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఏలేరు రిజర్వాయర్‌లోకి 20.2 టీఎంసీల నీరు చేరిందని, బుధవారం సాయంత్రం నుంచి 500 క్యూసెక్కులు దిగువకు వదులుతామని కలెక్టర్‌ వివరించారు. పిఠాపురం, పెద్దాపురం నియోజకవర్గాల వైపు నీరు మళ్లుతున్నాయన్నారు. గొల్లప్రోలు ప్రజలను, రైతులను అప్రమత్తం చేయాలని పవన్‌ సూచించారు. ముంపులో ఉన్నజగనన్న కాలనీవాసులకు నిత్యావసరాలు అందించాలని ఆదేశించారు. ముంపు గ్రామాల ప్రజలకు అవసరమైన ఆహారం, తాగునీరు, ఔషధాలు పూర్తిస్థాయిలో సిద్ధం చేసుకోవాలని సూచించారు.

Updated Date - Sep 05 , 2024 | 07:42 AM