Share News

ఏపీలో ఫోరెన్సిక్‌ యూనివర్సిటీ క్యాంపస్‌ ఏర్పాటు చేయండి

ABN , Publish Date - Oct 22 , 2024 | 03:33 AM

ఏపీలో నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ(ఎన్‌ఎ్‌ఫఎ్‌సయూ) క్యాంపస్‌ ఏర్పాటు చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు విజ్ఞప్తి చేశా రు.

ఏపీలో ఫోరెన్సిక్‌ యూనివర్సిటీ క్యాంపస్‌ ఏర్పాటు చేయండి

అమిత్‌షాకు టీడీపీపీ నేత లావు విజ్ఞప్తి

న్యూఢిల్లీ, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): ఏపీలో నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ(ఎన్‌ఎ్‌ఫఎ్‌సయూ) క్యాంపస్‌ ఏర్పాటు చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు విజ్ఞప్తి చేశా రు. విశాఖపట్నం లేదా అమరావతిలో దీన్ని ఏర్పాటు చేయాలని కోరారు. సోమవారం ఢిల్లీలో అమిత్‌షాతో ఎంపీ భేటీ అయ్యారు. ఎన్‌ఎ్‌ఫఎ్‌సయూ క్యాంపస్‌ ఏర్పాటుతో రాష్ట్ర ఫోరెన్సిక్‌ సామర్థ్యాలను బలోపేతం చేయడమే కాకుండా ఏపీలో విద్యా, అభివృద్ధి అవకాశాలను మరింత పెంచుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

బుడగ జంగాలను ఎస్సీల్లో చేర్చండి..

బేడా(బుడగ) జంగం సామాజిక వర్గాన్ని ఏపీలో నోటిఫై చేసిన ఎస్సీల జాబితాలో మళ్లీ చేర్చాలని గతేడాది రాష్ట్ర కేబినెట్‌, శాసనసభ చేసిన తీర్మానాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని అమిత్‌షాకు శ్రీకృష్ణదేవరాయలు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర సాంస్కృతిక, సామాజిక నిర్మాణంలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్న బుడగ జంగం సమాజం.. సామాజిక, ఆర్థిక, జీవనోపాధి పరిస్థితులకు సంబంధించి అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని వివరించారు. వారికి సంక్షేమ పథకాలు, విద్య, ఉపాధి అవకాశాలతో సహా సామాజిక, ఆర్థిక అవసరాలను తీర్చడానికి సమగ్ర విధానాన్ని రూపొందించడం చాలా ముఖ్యమన్నారు. రాష్ట్ర షెడ్యూల్డ్‌ కులాల(ఎస్సీ) కేటగీరీలో చేర్చాలన్న వారి డిమాండ్‌ను ప్రాధాన్య ప్రాతిపదికన పరిశీలించాలని కోరారు.

Updated Date - Oct 22 , 2024 | 03:33 AM