Patamata Police Station సాక్షి పత్రిక కథనాలపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
ABN , Publish Date - Oct 10 , 2024 | 07:06 PM
సాక్షి వార్త పత్రికలో ప్రచురిస్తున్న కథనాలు ప్రజల మధ్య శత్రుత్వం, ద్వేషాలు పెంచేలా ఉన్నాయని విజయవాడకు చెందిన న్యాయవాది గూడపాటి లక్ష్మీ నారాయణ విమర్శించారు. ఈ నేపథ్యంలో ఆ పత్రికపై చర్యలు తీసుకోవాలంటూ పటమట పోలీస్ స్టేషన్‌లో న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ గురువారం ఫిర్యాదు చేశారు.
విజయవాడ, అక్టోబర్ 10: సాక్షి వార్త పత్రికలో ప్రచురిస్తున్న కథనాలు ప్రజల మధ్య శత్రుత్వం, ద్వేషాలు పెంచేలా ఉన్నాయని విజయవాడకు చెందిన న్యాయవాది గూడపాటి లక్ష్మీ నారాయణ విమర్శించారు. ఈ నేపథ్యంలో ఆ పత్రికపై చర్యలు తీసుకోవాలంటూ పటమట పోలీస్ స్టేషన్‌లో న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ గురువారం ఫిర్యాదు చేశారు. ఈ వార్తా పత్రికలో ప్రజలను తప్పుదోవ పట్టించేలా.. అల్లర్లను ప్రేరేపించే ఉద్దేశ్యంతో తప్పుడు వార్తలను ప్రచురించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్లర్లకు వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అందుకోసం సాక్షి వార్తా పత్రికలో అడ్డగోలు కథనాలు వండి వారుస్తూ.. ప్రజలను రెచ్చ కొడుతున్నారన్నారు. పూర్తి అబద్దాలు, అసత్యాలతో.. విద్వేషాలు సృష్టిస్తున్నారంటూ వైసీపీ నేతలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ కథనాలను పరిశీలించి సాక్షి పత్రికపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా పోలీసులకు చేసిన ఫిర్యాదులో న్యాయవాది లక్ష్మీ నారాయణ స్పష్టం చేశారు. 2024, అక్టోబర్ 8వ తేదీన సాక్షి తెలుగు దినపత్రికలో ప్రచురితమైన వార్తల్లో అన్నీ అబద్దాలేనని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై ముందుగా చర్యలు తీసుకుంటే.. మరొకరు ఈ తప్పు చేయకుండా ఉంటారని న్యాయవాది గూడపాటి లక్ష్మీ నారాయణ స్పష్టం చేశారు.
For AndhraPradesh News Ad Telangana News