Share News

ప్రైవేట్‌ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం

ABN , Publish Date - Nov 06 , 2024 | 11:23 PM

నంద్యాల శ్రీనివాసనగర్‌ ప్రధాన రహదారిలో ఉన్న శ్రీకరి ఆస్పత్రిలో బుధవారం అగ్ని ప్రమాదం జరిగింది.

    ప్రైవేట్‌ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం
మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది

నంద్యాల క్రైం, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): నంద్యాల శ్రీనివాసనగర్‌ ప్రధాన రహదారిలో ఉన్న శ్రీకరి ఆస్పత్రిలో బుధవారం అగ్ని ప్రమాదం జరిగింది. ఆస్పత్రి మొదటి అంతస్తులో షార్ట్‌సర్క్యూట్‌ సంభవించడంతో మంటలు చెలరేగాయి. ఆస్పత్రి వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులను వారి సహాయకులు అప్రమత్తమై బయటకు తీసుకువచ్చారు. రోగులను మరో ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మొదటి అంతస్తు అద్దాలను పగలగొట్టారు. అగ్నిప్రమాదం తీవ్రత అధికంగా ఉండటంతో రెండు ఫైరింజన్ల ద్వారా మంటలను ఆర్పివేశారు. ఆస్పత్రిలోని ఆపరేషన థియేటర్‌లోని పరికరాలు, వార్డుల్లోని ఐసీయూ వెంటిలేటర్లు, ఆపరేషన పరికరాలు, కంప్యూటర్లు, ఏసీలు తదితర సామగ్రి మంటలకు ఆహుతైంది. ప్రమాదంలో దాదాపు రూ.కోటి వరకు ఆస్తి నష్టం సంభవించినట్లు ఆస్పత్రి నిర్వాహకుడు డా.విజయ్‌బాబు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.

Updated Date - Nov 06 , 2024 | 11:23 PM