చెర్వులో విష ప్రయోగం..?
ABN , Publish Date - Dec 03 , 2024 | 12:38 AM
వణుదుర్రు పంచాయతీకి చెందిన ఏడెకరాల చేపల చెరువులోని చేపల మృత్యువాత పడ్డాయి. సోమవారం ఉదయం చెరువులోని చేపలు టన్నుల కొద్ది చనిపోయి నీటిపై తేలియాడుతూ కన్పించాయి.
వణుదుర్రు పంచాయతీ చెరువులో చేపల మృత్యువాత
రూ. ఆరు లక్షలు నష్టమంటూ లీజుదారుడి ఆవేదన
ముదినేపల్లి, డిసెం బరు 2 (ఆంధ్రజ్యోతి) : వణుదుర్రు పంచాయతీకి చెందిన ఏడెకరాల చేపల చెరువులోని చేపల మృత్యువాత పడ్డాయి. సోమవారం ఉదయం చెరువులోని చేపలు టన్నుల కొద్ది చనిపోయి నీటిపై తేలియాడుతూ కన్పించాయి. ఆ చెరువును లీజుకు తీసుకున్న అదే గ్రామానికి చెందిన కట్టా సుబ్రహ్మణ్యం చెరువులోని అడుగు భాగాన్ని పరిశీలించగా, మరిన్ని చేపలు చనిపోయి కన్పించాయి. వాతావరణంలో మార్పుల వల్ల చేపలు చనిపోయాయా..? లేక చెరువులో విష ప్రయోగం జరిగిందా? అన్న అనుమానాన్ని లీజుదారుడు వ్యక్తం చేస్తున్నాడు. చెరువులో సుమారు ఎనిమిది టన్నుల వరకు చేపలు చనిపోగా రూ.6 లక్షల మేరకు నష్టం వాటిల్లిందని వాపోయాడు. చెరువులోని నీటిని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపి, వణుదుర్రు సచివాలయ మహిళా పోలీసుకు ఫిర్యాదు అందజేశాడు.