Share News

32కు చేరిన వరద మృతులు

ABN , Publish Date - Sep 05 , 2024 | 03:35 AM

రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద కారణంగా చనిపోయిన వారి సంఖ్య 32కు చేరింది. ఎన్టీఆర్‌ జిల్లాలో మృతుల సంఖ్య 24కు పెరిగింది.

32కు చేరిన వరద మృతులు

ఎన్టీఆర్‌ జిల్లాలో 24మంది మృత్యువాత

సహాయ చర్యలు వేగవంతం

అమరావతి, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద కారణంగా చనిపోయిన వారి సంఖ్య 32కు చేరింది. ఎన్టీఆర్‌ జిల్లాలో మృతుల సంఖ్య 24కు పెరిగింది. గుంటూరు జిల్లాలో ఏడుగురు, పల్నాడు జిల్లాలో ఒకరు చొప్పున మరణాలు నమోదయ్యాయని విపత్తుల నిర్వహణ సంస్థ బుధవారం వెల్లడించింది. ఎన్టీఆర్‌ జిల్లాలో గల్లంతైన ఇద్దరి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. విజయవాడ మొగల్రాజపురంలో ఐదుగురు, విజయవాడ రూరల్‌లో ముగ్గురు, జీ కొండూరు మండలంలో నలుగురు, రెడ్డిగూడెం, కంచికచర్ల మండలాల్లో ఒక్కొక్కరు, మైలవరం మండలంలో ఇద్దరు, ఇబ్రహీంపట్నంలో ఇద్దరు, విజయవాడ నార్త్‌లో ఐదుగురు, విజయవాడ ఈస్ట్‌లో ఒకరు మృతి చెందారు. గుంటూరు జిల్లా లో ఇద్దరు విద్యార్థులు, ఒక టీచర్‌, ఒక వృద్ధురాలు, మరో యువకుడు మృతి చెందగా, గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం వాగులో కొట్టుకువచ్చింది. పల్నాడు జిల్లా అచ్చంపేటలో బైక్‌పై వెళు తూ వాగులో కొట్టుకుపోయి ఒకరు వ్యక్తి మృతి చెందారు. మరోవైపు సహాయక చర్యలు వేగవంతమయ్యాయి.

Updated Date - Sep 05 , 2024 | 07:46 AM