Share News

శ్రీశైల పాదయాత్రికులకు అటవీశాఖ అడ్డంకులు

ABN , Publish Date - Nov 13 , 2024 | 11:31 PM

శ్రీశైలానికి కాలినడకన వెళ్లే భక్తులకు అటవీశాఖ అధికారులు మళ్లీ అడ్డంకులు సృష్టించారు.

 శ్రీశైల పాదయాత్రికులకు అటవీశాఖ అడ్డంకులు
బైర్లూటి చెక్‌పోస్టు వద్దకు ఆటోల్లో చేరుకున్న శ్రీశైల పాదయాత్రికులు

బైర్లూటి చెక్‌పోస్టు నుంచి వెళ్లనివ్వకుండా ఆంక్షలు

ఆత్మకూరు, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): శ్రీశైలానికి కాలినడకన వెళ్లే భక్తులకు అటవీశాఖ అధికారులు మళ్లీ అడ్డంకులు సృష్టించారు. బైర్లూటి చెక్‌పోస్టు మీదుగా పాదయాత్రగా వెళ్లేందుకు అనుమతించలేదు. ఈ విషయం హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధుల దృష్టికి వెళ్లడంతో వారి జోక్యం మేరకు అటవీ అధికారులు పాదయాత్రికులకు అనుమతిచ్చారు. పాములపాడు మండలంలోని పాములపాడు, ఇస్కాల, కంబాలపల్లి గ్రామాలకు చెందిన సుమారు 200 మందికి పైగా కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీశైలానికి కాలినడకన వెళ్తుండగా బైర్లూటి చెక్‌పోస్టు వద్ద అటవీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. భక్తులు కర్నూలు-గుంటూరు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తామని చెప్పడంతో దిగివచ్చిన అటవీ అధికారులు బైర్లూటి చెక్‌పోస్టు నుంచి వెళ్లేందుకు అనుమతించారు.

Updated Date - Nov 13 , 2024 | 11:31 PM