Forest lands are alien : అటవీ భూములు అన్యాక్రాంతం
ABN , Publish Date - Oct 27 , 2024 | 11:15 PM
అటవీ కార్యాలయానికి కనుచూపుమేర లోనే అటవీ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. ఆక్రమిత స్థలంలో అనధికార వెంచర్ వేసి ప్లాట్లుగా విభజించి విక్రయిస్తున్నారు. మరికొందరు పొలాలుగా, చిన్న చిన్న పరిశ్రమ లు నిర్వహిస్తున్నా అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం ప్రేక్షకపాత్ర వహిస్తోంది.
భవన నిర్మాణం, పొలాల సాగు
ప్రేక్షకపాత్రలో అధికారులు
కోర్టు తలుపు తట్టాల్సిందేనా ?
కడప ఎన్టీఆర్ సర్కిల్, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): అటవీ కార్యాలయానికి కనుచూపుమేర లోనే అటవీ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. ఆక్రమిత స్థలంలో అనధికార వెంచర్ వేసి ప్లాట్లుగా విభజించి విక్రయిస్తున్నారు. మరికొందరు పొలాలుగా, చిన్న చిన్న పరిశ్రమ లు నిర్వహిస్తున్నా అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం ప్రేక్షకపాత్ర వహిస్తోంది. అటవీ భూముల మీదుగా రోడ్డు వేయాలన్నా, రైలు మార్గం ఏర్పాటు చేయాలన్నా ఒక పట్టాన అనుమతులు రావు. కానీ వీరు తలచుకుంటే ఏమైనా చేయగలరనే ధీమాను ప్రదర్శిస్తుంటా రు. భారీ స్థాయిలో ఆక్రమణ జరుగుతున్నా పట్టించుకునే వారు లేకపోయారు. అటవీ ఆక్రమణలను తొలగించాలంటే సామాజికవేత్తలు కోర్టును ఆశ్రయిస్తే తప్ప అధికారుల్లో చలనం రాదనే భావన కలుగుతోంది. వివరాల్లోకెళితే....
ప్రొద్దుటూరు రిజర్వ్ ఫారెస్టు పరిధి బైపా్‌సరోడ్డు మొదలు ప్రొద్దుటూరు పట్టణ సమీపంలో అటవీశాఖ కార్యాలయం వరకు 158 హెక్టార్ల లో స్థలాన్ని పరిశ్రమల ఏర్పాటుకు కేటాయిం చారు. ఇందులో ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే విజయ పాలకర్మాగారం ఏర్పాటు చేశారు. అయితే క్రమంగా పాలకర్మాగారం మూతపడ డంతో ఇతర పరిశ్రమలు ఏవీ ఏర్పాటు కాకపోగా స్థలం నిరుపయోగంగా ఉండేది.
కమలాపురంలో మామిడి వనంగా రూపుదిద్దుకున్న రిజర్వ్ ఫారెస్ట్ భూమి
ఇదే అదనుగా భావించి రాజకీయ ప్రాబల్యం కలిగిన కొందరు స్థలాలను ఆక్రమించి విక్రయించడం ప్రారంభించారు. ఈ విషయంపై ఒక సామాజికవేత్త లోకాయుక్తను ఆశ్రయించడంతో నిర్మాణాలు తొలగించాలంటూ స్థానికులకు అటవీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆ స్థలం ఎవరిదనేదీ తెలియకుండా కొనుగోలు చేసి ఇళ్లనిర్మాణాలు చేపట్టిన తరువాత తొలగించాలం టూ అధికారులు వత్తిడి చేయడంతో బాధితు లు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే ఈభూమి రెవెన్యూ రికార్డుల్లో ఏటి పోరంబోకు గా నమోదైనట్లు తెలుస్తోంది. పూర్వపు ప్రొద్దుటూ రు అటవీ డివిజన్ పరిధిలో వేలాది ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వం అటవీ స్థలాలు కాపాడుకునేలా చర్యలు తీసుకుంటూ అడు గులు వేస్తోంది. ఎంతో విలువైన భూములు కొందరు ప్రైవేటు వ్యక్తులు దర్జాగా ఆక్రమించి అనుభవిస్తున్నా రు. ఇంతకాలం అటవీ భూములు ఆక్రమించారని క్షేత్రస్థాయిలో సిబ్బంది ఆడపాదడపా దా డులు చేసిన సందర్భాలున్నాయి. ఏళ్ల తరబడి అటవీ భూములుగా ఉన్న స్థలాలు ఇప్పటికప్పుడు ఏటిపోరంబోకు స్థలాలనే అంశం తెర పైకి రావడం గమనార్హం.
ప్రొద్దుటూరు నగరవనం వద్ద జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలు
చాలా చోట్ల అటవీ భూములు ఎంత మేర ఉన్నాయని నిగ్గు తేల్చేందుకు సర్వే చేయించాలనే ఆలోచనతో అటవీ అధికారులు ప్రయత్నం చేస్తున్నా తగినంత స్పందన లేకపోవడంతో ఆక్రమణల తొలగింపు విషయం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంలా తయారైంది.
నిర్మాణాలు, పొలాల సాగు
అటవీ స్థలాలు ఇప్పటికప్పుడు ఆక్రమించారనుకుంటే పొరబాటు. దాదాపు దశాబ్ధాలుగా ఆక్రమణల పర్వం కొనసాగుతూ వస్తోంది. ఎప్పటికప్పుడు అడ్డుకుని చర్యలు తీసుకోకపోవడంతో అక్రమార్కులకు అడ్డులేకుండా పోయింది. ప్రొద్టుటూరు అటవీశాఖ కార్యాలయం, ఏకో పార్క్ ఎదురుగా ఉన్న స్థలంలో 150 హెక్టార్లు మాత్రమే ఉండగా మిగిలిన స్థలం ఆక్రమణల కు గురైనట్లు తెలుస్తోంది. కొందరు క్షేత్రస్థాయి సిబ్బంది అక్రమార్కులతో చేతులు కలపడంతో భారీస్థాయి పండ్ల తోటలు, గృహనిర్మాణాలు వెలిశాయనే ఆరోపణలు లేకపోలేదు. నిబంధన లు పక్కనబెట్టి వీటికి విద్యుత్ సౌకర్యం కూడా కల్పించారు. అక్రమార్కుల్లో రాజకీయ పలుకుబడి కలిగిన వ్యక్తులు ఉండడంతో అధికారులు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. అయితే వీరికి కొందరు అటవీ ఉద్యోగులు కూడా సహ కరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. నాగసానిపల్లె, కమలాపురం రిజర్వు ఫారెస్టు స్థలం దాదాపు అక్రమణదారులు మామిడి వనాలు సాగు చేసుకుని అనుభవిస్తున్నారు. పోరుమామిళ్ల రేంజ్‌లో 44 హెక్టార్లు ఆక్రమణలకు గురైనట్లు సమాచారం. ఇందులో అత్యధిక భాగం జ్యోతి క్షేత్రంలో ఆక్రమించుకున్నట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత అడవు ల పరిరక్షణపై దృష్టి సారించడంతో ఆక్రమణదారుల కబంద హస్తాల నుంచి బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఆక్రమణదారులు మేలు చేసే అధికారులు లేకపోలేదు. నిబంధనల ప్రకారం నోటీసు ఇస్తారు. వాటి ఆధారంగా కోర్టును ఆశ్రయించడంతో ఆక్రమణ దారులకు కొంతకాలం ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం చొరవ తీసుకుని ఇలాంటి వాటిపై కాలయాపన చేయకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
అలసత్వం వీడాలి
ఆక్రమణలో ఉన్న అడవులను కాపాడుకోవడానికి అధికారులు అలసత్వం వీడాల్సిన అవస రం ఉంది. ప్రొద్దుటూరులో విలువైన స్థలాలు కళ్ల ఎదుటే ఆక్రమణలకు గురవుతున్నా దశాబ్ధాలుగా అధికారులు పట్టించుకోకపోవడంతో ఒక సామాజిక వేత్త లోకాయుక్తను ఆశ్రయించడంతో అధికారుల్లో కదలిక వచ్చింది. దాదాపు వంద మందికి పైగా గృహా లు నిర్మాణం చేపట్టిన వారికి నోటీసులు ఇస్తారు. ఒక పక్కన లో కాయుక్త ఆదేశాలుండడం, మరో పక్క చిత్తశు ద్ది కలిగిన అధికార యంత్రాం గం ఆక్రమణలు తొలగించడంపై దృష్టి సారిస్తున్నారు. ఒక ప్రొ ద్దుటూరు పట్టణంలోనే కాకుండా జిల్లాలో మరికొన్ని చోట్ల ఆక్రమణలను తొలగించడం కో సం చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.
జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఆక్రమణలకు గురైన ప్రాంతాలు
- రామేశ్వరం, పెన్నార్‌బ్లాక్ 1, 2, 3
- వెదురూరు రిజర్వు ఫారెస్టులో 732 హెక్టార్లు
- కల్లమల రిజర్వులో పెన్నార్ 5, 6 బ్లాక్
- నాగసానిపల్లె, కమలాపురం రిజర్వ్ ఫారెస్టు స్థలం
- ముద్దనూరు రేంజ్‌లో 14000 హెక్టార్లు
- కొండాపురం మండలం వెంకయ్యకాల్వ రిజర్వు ఫారెస్టు
- జమ్మలమడుగు మండలం శెట్టివారిపల్లె వద్ద పెన్నేరు బ్లాక్
- తొండూరు మండలం మల్లెల
- వనిపెంట రేంజ్ పరిధిలో 29వేల హెక్టార్లు
- పోరుమామిళ్ల రేంజ్‌లో 44 హెక్టార్లు
- బద్వేలు రేంజ్ పరిధిలో బ్రాహ్మణపల్లె వద్ద సుమారు 46వేల హెక్టార్లు
ఆక్రమణల తొలగింపుపై చర్యలు తీసుకుంటున్నాం
అటవీ స్థలాలను గుర్తించి ఆక్ర మితుల నుంచి స్వాధీనం చేసుకుం టాం. ప్రొద్దుటూరు పట్టణంలో ఫారెస్టు కార్యాలయం ఎదురుగా ఇల్లు నిర్మించుకున్న వారికి ఇప్పటికే నోటీసులు జారీ చేశాం. చాలాచోట్ల ఏటిపోరంబోకుగా రెవెన్యూ రికార్డుల్లో ఉన్నట్లు ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. సర్వే పూర్తయితే కానీ అక్రమాలకు గురైంది అటవీ స్థలాలా కాదా అనేది ఒక స్పష్టతకు వస్తుంది. దానికనుగుణంగా చర్యలు తీసుకుంటాం.
హేమాంజలి, ఫారెస్టురేంజ్ ఆఫీసరు, ప్రొద్దుటూరు