వైసీపీ బరితెగించింది: కూటమి నేతలు
ABN , Publish Date - May 14 , 2024 | 03:31 AM
రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని హైజాక్ చేయడానికి వైసీపీ ప్రయత్నం చేసిందని ఎన్డీయే కూటమి నేతలు ధ్వజమెత్తారు. సోమవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ మాట్లాడుతూ...
అమరావతి, మే 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని హైజాక్ చేయడానికి వైసీపీ ప్రయత్నం చేసిందని ఎన్డీయే కూటమి నేతలు ధ్వజమెత్తారు. సోమవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ మాట్లాడుతూ... ‘పోలింగ్ సరళి చూసి, వైసీపీ నేతల్లో వణుకు పుట్టింది.
టీడీపీ అభ్యర్థులు, ఏజెంట్లు, కార్యకర్తలపై దాడులకు దిగారు. మీడియాపైనా దాడులకు తెగబడ్డారు. ఓటమి భయంతో అధికారాన్ని నిలుపుకోవటానికి దాడులకు పాల్పడిన వైసీపీ నేతలపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి’ అని విజ్ఞప్తి చేశారు. బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ మాట్లాడుతూ... వైసీపీ బరితెగించి, కూటమి అభ్యర్థులపై దాడులకు తెగబడిందన్నారు. జనసేన నేత కేకే శరత్ మాట్లాడుతూ... ‘జగన్ అరాచకాలపై విసిగిపోయిన జనం పోలింగ్ బూత్‌ల వద్ద బారులుతీరి, కూటమి అభ్యర్థులను ఆదరిస్తున్నారు’ అని అన్నారు.