Home » TDP - Janasena
ఏఎంసీ చైర్మన్ పదవుల కేటాయింపులో జనసేనకు ప్రాధాన్యత ఇవ్వడం టీడీపీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తికి దారితీసింది. సిఫారసులు పట్టించుకోకపోవడంపై పలువురు ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో రూ.3.70 కోట్లతో 21 రహదారులను ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా, కొన్ని గ్రామాల్లో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి, టీడీపీ కార్యకర్తలు ‘జై టీడీపీ’ నినాదాలు చేశారు. జనసేన నాయకుడు మొయిళ్ల నాగబాబు పై దాడి జరిగింది,
వక్ఫ్ సవరణ బిల్లుపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ప్రభుత్వంపై వ్యతిరేకంగా విపక్షాలు వాకౌట్ చేయగా, బిల్లును రాజ్యాంగ వ్యతిరేకంగా ఆరోపిస్తూ ఒవైసీ తీవ్ర విమర్శలు చేశారు.
నియోజకవర్గాల పునర్విభజనపై చెన్నైలో డీఎంకే నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి టీడీపీ, జనసేన హాజరు కాలేదు.
వైసీపీ పార్టీకి మరో బిగ్ షాక్ తగలనుంది. విశాఖ పట్నం జీవీఎంసీ మేయర్ పదవి దూరం కానుంది. వైసీపీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కూటమి పార్టీలు సిద్ధమయ్యాయి.
వేతనాల కోసం రోడ్డెక్కి పోరాటం చేస్తున్న మహిళల్ని జగన జైలుకు పంపారని, సొంత తల్లి, చెల్లిని ఆస్తుల కోసం కోర్టుకు లాగారని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత విమర్శించారు. అలాంటి వ్యక్తికి మహిళల గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు. అసెంబ్లీలో బుధవారం మహిళా సాధికారత అంశంపై ఆమె మాట్లాడారు. బడ్జెట్లో మహిళా శిశు సంక్షేమానికి రూ.4,300 కోట్లు కేటాయించారని, ఇది మహిళా బడ్జెట్ అని అన్నారు. గత ...
ఇళ్లు కట్టుకుంటున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. వైసీపీ ప్రభుత్వంలో మంజూరై వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న ఇళ్లను పూర్తి చేసుకు నేందుకు అదనంగా నిధులు చెల్లించేందుకు శ్రీకారం చుట్టింది. గత ప్రభు త్వం చెల్లించిన మొత్తంతో పాటు బీసీ, ఎస్సీలకు అదనంగా రూ.50వేలు, ఎస్టీలకు రూ.75వేలు చెల్లించేందుకు కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో 4232మంది ఎస్సీ లబ్ధిదారులకు ...
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇష్టారాజ్యంగా పింఛన్లు పంపిణీ చేశారు. అర్హత లేకపోయినా కొందరు దివ్యాంగుల పేరుతో ధ్రువపత్రాలు సంపాదించి.. ఆ మేరకు పింఛన్లు తీసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నకిలీ పింఛన్లపై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కొందరు డీఆర్డీఏ, వైద్య సిబ్బంది వసూళ్లకు తెరలేపారు. వైద్యులతో మాట్లాడి మీ ధ్రువపత్రాలకు ఆమోదం వేయిస్తామని భారీగా డబ్బులు లాగుతున్నట్లు తెలుస్తోంది....
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీలో వణుకు మొదలైందా.. కూటమి ప్రభుత్వానికి ప్రజలు మద్దతుగా ఉన్నారనే విషయం మరోసారి స్పష్టమైందా. ఎలాగైనా కూటమి అభ్యర్థులను ఓడించాలనే వైసీపీ కుట్రను యువత తిప్పికొట్టారా..
ప్రతిపక్ష నేతగా గుర్తించాలన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి విన్నపాన్ని పరిశీలించడం సాధ్యపడదని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు.