Share News

టీటీడీ మాజీ హెల్త్‌ ఆఫీసర్‌ బొబ్బా భీష్మయ్య నాయుడు కన్నుమూత

ABN , Publish Date - Oct 22 , 2024 | 03:14 AM

టీటీడీ విశ్రాంత హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ బొబ్బా భీష్మయ్య నాయుడు (70) సోమవారం మృతిచెందారు.

టీటీడీ మాజీ హెల్త్‌ ఆఫీసర్‌ బొబ్బా భీష్మయ్య నాయుడు కన్నుమూత

తిరుపతి, అక్టోబరు21(ఆంధ్రజ్యోతి): టీటీడీ విశ్రాంత హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ బొబ్బా భీష్మయ్య నాయుడు (70) సోమవారం మృతిచెందారు. అనారోగ్యానికి గురైన ఆయన హైదరాబాదులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. భీష్మయ్య నాయుడు భౌతికకాయాన్ని స్వగ్రామమైన తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శేషాపురం గ్రామానికి తీసుకురానున్నారు. మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు తమ స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. భీష్మయ్య నాయుడు నారావారిపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో, కళ్యాణి డ్యామ్‌ పోలీస్‌ ట్రైనింగ్‌ కళాశాలలో, తిరుపతి మున్సిపల్‌ కార్యాలయంలో వెద్యాధికారిగా పనిచేశారు. అనంతరం తిరుమలలో హెల్త్‌ ఆఫీసర్‌గా పని చేస్తూ పదవీ విరమణ చేశారు. పనిచేసిన ప్రతిచోటా ఆయన తనదైన ముద్ర వేశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Updated Date - Oct 22 , 2024 | 03:15 AM