Janasena: జనసేనలో చేరిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు
ABN , Publish Date - Feb 26 , 2024 | 07:20 PM
ఎన్నికలు సమీపిస్తున్న టీడీపీ, జనసేన (TDP- Janasena) పార్టీల్లోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి చెందిన మాజీ మంత్రి, కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేన పార్టీలో చేరారు. జనసేనాని పవన్ కల్యాణ్ సమక్షంలో సోమవారం ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. పార్టీ కండువాను కప్పి పవన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పనిచేయాలని సూచించారు.
అమరావతి: ఎన్నికలు సమీపిస్తున్న టీడీపీ, జనసేన (TDP- Janasena) పార్టీల్లోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి చెందిన మాజీ మంత్రి, కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేన పార్టీలో చేరారు. జనసేనాని పవన్ కల్యాణ్ సమక్షంలో సోమవారం ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. పార్టీ కండువాను కప్పి పవన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పనిచేయాలని సూచించారు. కొత్తపల్లి సుబ్బారాయుడు చేరికతో పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన పార్టీకి కొత్త ఉత్సహం వస్తుందని, ఆయన సేవలు పార్టీకి ఎంతో అవసరమని పవన్ కల్యాణ్ అన్నారు. సుబ్బారాయుడి రాజకీయ అనుభవం జనసేన విజయానికి దోహదపడుతుందని అన్నారు.
తెలుగుదేశం పార్టీతో సుదీర్ఘ అనుభవం ఉన్న కొత్త సుబ్బారాయుడు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ శాఖ మంత్రిగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో పనిచేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలోకూ కీలకంగా పనిచేశారు. అనంతరం వైసీపీలో చేరారు. జనసేనలో చేరుతున్నట్టు ఇటీవలే సుబ్బారాయుడు ప్రకటించారు. సోమవారం మంచి రోజు కావడంతో పార్టీలో చేరారని జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది.