Share News

మాజీ ఎమ్మెల్యే వెంకటరెడ్డి కన్నుమూత

ABN , Publish Date - Jun 24 , 2024 | 03:41 AM

శ్రీసత్యసాయి జిల్లాలో గతంలో ఉన్న నల్లమాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వెంకటరెడ్డి(87) ఆదివారం అనారోగ్యంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

మాజీ ఎమ్మెల్యే వెంకటరెడ్డి కన్నుమూత

ముదిగుబ్బ, జూన్‌23: శ్రీసత్యసాయి జిల్లాలో గతంలో ఉన్న నల్లమాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వెంకటరెడ్డి(87) ఆదివారం అనారోగ్యంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వెంకటరెడ్డి స్వగ్రామం జిల్లాలోని ముదిగుబ్బ మండలం మలకవేముల. 1985లో టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు ప్రభుత్వంలో నల్లమాడ నియోజకవర్గ శాసన సభ్యుడిగా గెలుపొందారు. దీనిని తరువాత పుట్టపర్తి నియోజకవర్గంగా మార్చారు.

Updated Date - Jun 24 , 2024 | 03:41 AM