Share News

formers ఆగ్రహించిన అన్నదాత

ABN , Publish Date - Sep 16 , 2024 | 11:34 PM

వ్యవసాయానికి విద్యుత సరఫరాలో ట్రాన్సకో అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ నిట్టూరు, చిక్కేపల్లి గ్రామాల రైతులు సోమవారం నిట్టూరు విద్యుత సబ్‌స్టేషనను ముట్టడించారు.

formers ఆగ్రహించిన అన్నదాత
ట్రాన్సకో ఏఈ రాజారావుతో వాగ్వాదం చేస్తున్న రైతులు

విద్యుత సరఫరాలో నిర్లక్ష్యం...

సబ్‌స్టేషన ముట్టడి

అధికారులపై మండిపాటు

యాడికి, సెప్టెంబరు 16: వ్యవసాయానికి విద్యుత సరఫరాలో ట్రాన్సకో అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ నిట్టూరు, చిక్కేపల్లి గ్రామాల రైతులు సోమవారం నిట్టూరు విద్యుత సబ్‌స్టేషనను ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయానికి 9గంటల నిరంతర విద్యుత సరఫరా చేయాలని ప్రభుత్వం చెబుతున్నా ఇక్కడి ట్రాన్సకో అధికారులు అమలు చేయడం లేదన్నారు. స్థానిక అధికారులు వ్యవసాయానికి ఇష్టానుసారంగా కరెంట్‌ సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. రాత్రి పూట, తెల్లవారుజామున విద్యుత సరఫరా చేస్తూ రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయానికి 7 గంటలే కరెంట్‌ సరఫరా చేస్తున్నారని, అది కూడా అంతరాయంతో సరఫరా చేస్తున్నారని మండిపడ్డారు. కరెంట్‌ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియక పంటలు ఎండబెట్టుకోవాల్సి వస్తోందని తెలిపారు. విద్యుత సబ్‌స్టేషనను రైతులు ముట్టడించారని సమాచారం అందుకున్న పోలీసులు సబ్‌స్టేషన వద్దకు వెళ్లారు. రైతులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ట్రాన్సకో ఏఈ వచ్చి వివరణ ఇచ్చేదాకా కదిలేది లేదని రైతులు తెలిపారు. సబ్‌స్టేషన వద్దకు ఏఈ రాజారావు వచ్చి రైతులకు సర్దిచెప్పారు. సబ్‌స్టేషనలో చిన్నచిన్న మరమ్మతుల కారణంగా అంతరాయం కలుగుతోందని తెలిపారు. మరమ్మతులు పూర్తికాగానే అంతరాయం లేకుండా వ్యవసాయానికి కరెంట్‌ సరఫరా చేస్తామని తెలిపారు. వీలైనంత తొందరగా సమస్యను పరిష్కరించకపోతే ఆందోళన కార్యక్రమాలు మరింత ఉధృతంగా చేపడతామని ట్రాన్సకో అధికారులను రైతులు హెచ్చరించారు.

Updated Date - Sep 16 , 2024 | 11:35 PM