అయోధ్య మొదలు.. భద్రాద్రి వరకూ తెలుగువారికి వెలుగులా పురాణపండ వారి శ్రీరామరక్షాస్తోత్రమ్
ABN , Publish Date - Jul 03 , 2024 | 11:55 PM
పురాణపండ రాధాకృష్ణమూర్తి యజ్ఞమయ సంకల్పం బలమైనది కాబట్టే ఆయన కుమారుడు, ప్రముఖ రచయిత, ఆంధ్రప్రదేశ్ దేవాదాయధర్మాదాయశాఖ ఆధికారిక మాసపత్రిక ‘ఆరాధన’ పూర్వ సంపాదకులు పురాణపండ శ్రీనివాస్ తన తండ్రి మహదాశయాన్ని సరిక్రొత్త పుంతలు తొక్కిస్తూ తెలుగు రాష్ట్రాల ఆలయాల్ని, పీఠాల్ని, మఠాల్ని, వేదపాఠశాలల్ని శ్రీరామరక్షాస్తోత్రమ్ అఖండ మగలా స్తోత్ర వైభవ ప్రచారంతో, ఉచిత పంపిణీతో చుట్టేస్తున్నారు.
వాడపల్లి, జూలై ౩: అద్భుతాలెన్నో ఆవిష్కరించే శ్రీరామరక్షాస్తోత్రాన్ని ఇటీవల ఎంతమంది ప్రచురిస్తున్నా... సుమారు యాభయ్యేళ్ళనుండీ తెలుగునాట లక్షలాదిమంది ఇళ్లలో పూజాపీఠాలముందు ప్రతిధ్వనించే శ్రీరామరక్షాస్తోత్రమ్ పారాయణ వెనుక ఉన్న మహా మంగళ సంకల్పం, పవిత్ర దీక్ష, ఇంటింటికీ శ్రీరామరక్షాస్తోత్రమ్ చేరాలనే... చేర్చాలనే తపస్సు నిస్సందేహంగా పవిత్రమూర్తులు, శ్రీరామరక్షాస్తోత్రమ్ కోటి ప్రతుల ఉచిత వితరణోద్యమాన్ని నెరవేర్చిన భాగవతమందిరం సంస్థాపకులు, విఖ్యాత ఆధ్యాత్మికవేత్త పురాణపండ రాధాకృష్ణమూర్తి అనేది అర్ధశతాబ్దపు కాలమే సత్యాలతో సాక్షాత్కరిస్తుంది.
పురాణపండ రాధాకృష్ణమూర్తి యజ్ఞమయ సంకల్పం బలమైనది కాబట్టే ఆయన కుమారుడు, ప్రముఖ రచయిత, ఆంధ్రప్రదేశ్ దేవాదాయధర్మాదాయశాఖ ఆధికారిక మాసపత్రిక ‘ఆరాధన’ పూర్వ సంపాదకులు పురాణపండ శ్రీనివాస్ తన తండ్రి మహదాశయాన్ని సరిక్రొత్త పుంతలు తొక్కిస్తూ తెలుగు రాష్ట్రాల ఆలయాల్ని, పీఠాల్ని, మఠాల్ని, వేదపాఠశాలల్ని శ్రీరామరక్షాస్తోత్రమ్ అఖండ మగలా స్తోత్ర వైభవ ప్రచారంతో, ఉచిత పంపిణీతో చుట్టేస్తున్నారు.
విఖ్యాత ఆధ్యాత్మికసంస్థ జ్ఞానమహాయజ్ఞకేంద్రం సంస్థాపకునిగా లక్షల తెలుగువారికి ప్రముఖ రచయితగా అపురూప రచనలతో నిస్వార్ధ ధార్మిక సేవ చేస్తున్న పురాణపండ శ్రీనివాస్ నూతన శోభతో అందించిన శ్రీరామరక్షాస్తోత్రమ్ గ్రంధం ఎన్నో ఆలయాలలో పవిత్రసందడి చేస్తోంది. గోదావరి జిల్లాలో ప్రఖ్యాత శ్రీవైష్ణవక్షేత్రమైన వాడపల్లి వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అర్చకులు, అధికారులు స్వామి వారి ఉత్సవాలలో వందలాది భక్తులకు శ్రీరామరక్షాస్తోత్రాన్ని పంచిన సందర్భంలో భక్తజనులనుండి వచ్చిన స్పందన అనూహ్యం.
శ్రీరామరక్షాస్తోత్రమ్ పారాయణా విధానం తెలుసుకోవడం కోసమే నాటి ముఖ్యమంత్రి ఎన్ఠీఆర్ తన తెలుగుదేశం ప్రచార రథంతో కుమారుడు హరికృష్ణతో కలిసి రాజమహేంద్రవరంలో పురాణపండ రాధాకృష్ణమూర్తిని కలిసి సుమారు అరగంటసేపు చర్చలు జరపడం ఆరోజుల్లో పవిత్ర సంచలమైంది. రాధాకృష్ణమూర్తి వాగవైభవం గురించి ఎన్ఠీఆర్ నాటి దానవీరసూరకర్ణ రచయిత త్రిపురనేని మహారధితో ఎంతో చక్కగా, ఒక మంగళస్వరూపంగా చెప్పిన అంశాన్ని ఒక సందర్భంలో త్రిపురనేని మహారధి ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు కూడా.
శ్రీరామరక్షా స్తోత్రాన్ని ఇప్పటి ప్రధాని నరేంద్రమోదీ, ఎల్.కె. అద్వానీ, ఆరెస్సెస్ సమూహాలు నిత్యం పారాయణం చేస్తారు. ఇటీవల అయోధ్య రామాలయ ప్రారంభానికి ముందు రెండు నెలలూ దేశమంతటా కొన్ని లక్షలమంది ఇళ్లలో పారాయణ చేసిన అపూర్వ అస్త్రమే శ్రీరామరక్షా స్తోత్రమ్.
కొన్ని దశాబ్దాలకు పూర్వమే ఈ అద్భుతాన్ని తెలుగులకు వెలుగుగా పంచిన ఘనత భాగవతమందిరం సంస్థాపకులు పురాణపండ రాధాకృష్ణమూర్తికే దక్కడం ఒక విశేషమే.
ఇప్పటి తరాలకు, భక్తులకు పవిత్రమయ ఆకర్షణీయమైన రీతిలో ఈ దివ్య గ్రంధాన్ని ఎన్నో క్షేత్రాల, ఆలయాల ద్వారా వేలకొలది భక్తులకు ఉచితంగా బహూకరింప చేస్తున్న పురాణపండ శ్రీనివాస్ దైవీయ స్పృహను తిరుమల, సింహాచలం, భద్రాచలం పండిత సమూహాలు అభినందిస్తున్నాయి.
వందల సంవత్సరాల తిరుమల కోదండ రామాలయంలో మొన్నటి శ్రీరామనవమి పర్వదిన వేళ వందల భక్తులకు ఈ అపూర్వ రక్ష అందడం ఎంతో ఆనందం కలిగించే విషయం.
ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపి, లక్షలాదిమంది ఇళ్లలో శాంతిని ప్రసరింపచేసిన శ్రీరామరక్షాస్తోత్రమ్ అపారశక్తిసంపన్నమైందని.. ఇప్పటికీ అయోధ్య మొదలు, ఒంటిమిట్ట, భద్రాచలం వరకూ లక్షలమంది పారాయణం చెయ్యడం కన్నులముందే కనిపించే రమణీయ దృశ్యం.