Share News

తీవ్ర తుఫాన్‌పై పూర్తి అప్రమత్తత: సిసోడియా

ABN , Publish Date - Oct 22 , 2024 | 03:22 AM

బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌ ఏర్పడనున్న నేపథ్యంలో అవసరమైతే తీర ప్రాంతాల్లో నివసించే ప్రజల్ని సురక్షిత ప్రదేశాలకు, సహాయ పునరావాస శిబిరాలకు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, విపత్తుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తెలిపారు.

తీవ్ర తుఫాన్‌పై పూర్తి అప్రమత్తత: సిసోడియా

అమరావతి, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌ ఏర్పడనున్న నేపథ్యంలో అవసరమైతే తీర ప్రాంతాల్లో నివసించే ప్రజల్ని సురక్షిత ప్రదేశాలకు, సహాయ పునరావాస శిబిరాలకు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, విపత్తుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తెలిపారు. తుఫాన్‌ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధతపై సోమవారం కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఒడిశా, బెంగాల్‌ సీఎ్‌సలతో పాటు ఏపీ నుంచి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా పాల్గొని, తుఫాన్‌ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలో తీసుకున్న ముందస్తు చర్యలను వివరించారు. మత్స్యకారులు 25వ తేదీ వరకు సముద్రంలోకి వెళ్లరాదని హెచ్చరించి, ఇప్పటికే సముద్రంలోకి వెళ్లిన వారిని నేవీ సహకారంతో వెనక్కి రప్పించామన్నారు.

Updated Date - Oct 22 , 2024 | 03:23 AM