Share News

Genomics Biotech : కొత్త ఆవిష్కరణలకు ప్రసిద్ధి జీనోమిక్స్‌ బయోటెక్‌

ABN , Publish Date - Sep 15 , 2024 | 11:13 PM

ఆరోగ్య సంరక్షణ మెరుగు దల కోసం వినూత్న ఆవిష్కరణలను జీనోమిక్స్‌ బయోటెక్‌ ద్వారా అందిస్తున్నామని జీనోమిక్స్‌ ప్రెసిడెంట్‌ సీఈఓ రత్నగి రి తెలిపారు.

Genomics Biotech : కొత్త ఆవిష్కరణలకు ప్రసిద్ధి జీనోమిక్స్‌ బయోటెక్‌
అవార్డును అందుకుంటున్న శాస్త్రవేత్త డాక్టర్‌ వినయ్‌చంద్‌

ప్రొఫెసర్‌ రత్నగిరి పోలవరపు

పులివెందుల టౌన్‌, సెప్టెంబరు 15: ఆరోగ్య సంరక్షణ మెరుగు దల కోసం వినూత్న ఆవిష్కరణలను జీనోమిక్స్‌ బయోటెక్‌ ద్వారా అందిస్తున్నామని జీనోమిక్స్‌ ప్రెసిడెంట్‌ సీఈఓ రత్నగి రి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ మేం ఐవీఆర్‌ ఐ వారితో కలిసి కోళ్లవ్యాధులపై చేసిన పరిశోధనలకు బీఐఆర్‌ ఏసీ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ భారత ప్రభుత్వ ఇన్నోవేటర్‌ అవార్డును ఇచ్చారన్నారు. ఈ అవార్డును డీబీటీసీ సెక్రటరీ రాజేశ్‌ సుధీర్‌ గోఖలే చేతుల మీదుగా అందుకున్నం దుకు గర్వంగా ఉందన్నారు. భవిష్యత్తులో మా జీనోమిక్స్‌ బయోటెక్‌ ద్వారా మరిన్ని పరిశోధనలు చేస్తామన్నారు. 2003 లో జీనోమిక్స్‌ బయోటెక్‌ అత్యాధునిక పరిశోధన కేంద్రాన్ని స్థాపించామన్నారు. నాటి నుంచి మేంజీనోమిక్స్‌ మాలిక్యులర్‌ డయాగ్నోస్టిక్‌ ప్రైవేటులిమిటెడ్‌, జీనోమిక్స్‌ హెల్త్‌ కేర్‌ ఆఫ్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ జెనోమిక్స్‌ కార్ల్‌ ప్రైవేటు లిమిటె డ్‌ వంటివి ప్రభుత్వ ప్రైవేటు సహకారంతో ఏర్పాటు చేశామ న్నారు. పశువుల ఆరోగ్యాన్ని మెరుగు పరిచేందుకు ఏపీ ప్రభు త్వంతో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా పులివెందుల లో జీనోమిక్స్‌ కార్ల్‌ ప్రైవేటు లిమిటెడ్‌ ఏర్పాటు చేశామన్నారు. మా పరిశోధన కేంద్రం మానవ ఆరోగ్య అవసరాలకు సంబం ధిత వ్యాధిని గుర్తించే కిట్లను కూడా అందిస్తుందన్నారు.


మరీముఖ్యంగా మలేరియా, డెంగ్యు, హెచ్‌ఐవీ, హెచ్‌సీవీ సహా జంతువుల ఆరోగ్య అవసరాలకు సంబంధించిన బ్రూసె ల్లో సిస్‌, టిబా, పుట్‌అండ్‌ మౌత్‌ డిసీస్‌ వంటి వ్యాధి నిర్ధారణ కిట్లను ఉత్పత్తి చేస్తున్నామన్నారు. 2018లో ఎన్‌ఆర్‌సీఈ వారి సహకారంతో దేశంలోనే ఏకైక గ్లాండర్స్‌ వ్యాధి నిర్ధారణ కిట్‌ కనుక్కున్నామన్నారు. కరోనా సమయంలో కూడా వ్యాధి నిర్ధా రించడానికి కావలసిన కిట్లను అబివృద్ధి చేసి కర్నూలులో ల్యాబ్‌ ఏర్పాటు చేసి అప్పటి ఏపీ ప్రభుత్వానికి సహకరించిం దన్నారు. గ్రామీణ, ఆర్థికంగా వెనుకబడిన జనాభాకు మా పరిశోధన కేంద్రం మద్దతు ఇస్తుందన్నారు. భవిష్యత్తులో జీనోమిక్స్‌ బయోటెక్‌ పరిశోధన కేంద్రం ద్వారా ప్రజా పరిరక్షణకు దోహదపడతామని తెలిపారు. ఈ సందర్భంగా అవార్డును అందిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Sep 15 , 2024 | 11:13 PM