Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీత రచన పోటీ
ABN , Publish Date - Jun 01 , 2024 | 05:34 AM
ఆంధ్రప్రదేశ్ భౌగోళిక, సాహితి, సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పే గీత రచన పోటీలు నిర్వహిస్తున్నామని, ఎంపికైన గీతానికి రూ.లక్ష బహుమానం అందజేస్తామని ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు
ఎంపికైన గీతానికి రూ.లక్ష బహుమానం
విజయవాడ(అజిత్‌సింగ్‌నగర్), మే 31: ఆంధ్రప్రదేశ్ భౌగోళిక, సాహితి, సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పే గీత రచన పోటీలు నిర్వహిస్తున్నామని, ఎంపికైన గీతానికి రూ.లక్ష బహుమానం అందజేస్తామని ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఉమ్మడి రాష్ట్ర గీతంగా ఉన్న ‘‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’’ గీతాన్ని గౌరవిస్తూనే దాని స్థానంలో వర్తమాన ఆంధ్రప్రాంత వైభవ స్వాభిమాన గీతాన్ని రూపొందించాలని, అందుకు ఐదు నిమిషాల నిడివి గల గీత రచన పోటీలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
జూన్ 30వ తేదీ లోపు రూపొందించిన గీతాన్ని ఆంధ్ర సారస్వత పరిషత్, అల్లూరి సత్యనారాయణరాజు సాంస్కృతిక కేంద్రం, నరసాపురం, పశ్చిమ గోదావరి జిల్లా చిరునామాకు పంపించాలని సూచించారు.