Home » West Godavari
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో ‘పార్శిల్లో మృతదేహం డెలివరీ’ మిస్టరీ వీడుతోంది. ప్రధాన సూత్రధారి తులసి మరిది సిద్ధార్థ వర్మే అని భావిస్తున్నారు.
‘మీరు అడిగిన విధంగా మీ ఇంటి నిర్మాణానికి ఇప్పటికే టైల్స్, పెయింటింగ్ డబ్బాలు పంపించాం. మరి కొంత ఇంటి సామగ్రిని పంపిస్తున్నాం’ అంటూ ఆమెకు ఓ ఫోన్ కాల్ వచ్చింది.
పశ్చిమగోదావరి జిల్లాలో ఓ పార్సిల్ను స్థానికులు తీవ్ర భయాందోళలనకు గురి అయ్యారు. సాధారణంగా పార్సిల్లో ఏమైనా వస్తువులు వస్తుంటాయి. కానీ యoడగండిలో వచ్చిన పార్సిల్లో మాత్రం వ్యక్తి మృతదేహం తీవ్ర కలకలం సృష్టించింది.
2014-19 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించేవారు. పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు కాంట్రాక్టర్, అధికారుల నుంచి సమాచారం తెలుకునేవారు. అయితే 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత రెండోసారి ఆయన పోలవరానికి వెళుతున్నారు.
ప.గో. జిల్లా: మంత్రి నిమ్మల రామానాయుడు ఆదివారం ఉదయం పాలకొల్లు సేవ్ గర్ల్ చైల్ఢ్ పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక నేతలు, హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్ నాగరాణి తదితరులు హాజరయ్యారు.
జగన్ పాలనలో యువత గంజాయి, మాదక ద్రవ్యాలకు అలవాటు పడి నిర్వీర్యమయ్యారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఈ క్రమంలో పాలకొల్లులో ఆదివారం ఉదయం సేవ్ ది గర్ల్ చైల్డ్ పేరుతో 2కే రన్ ప్రారంభించారు. అనంతరం భారీగా బహిరంగ సభ నిర్వహించనున్నారు.
రైతులు ధాన్యాన్ని నచ్చిన మిల్లర్లకు అమ్ముకునే వెసులుబాటుతో పాటు.. 24 గంటల్లో బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ అవుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. జగన్ రైతులకు చెల్లించాల్సిన రూ.1674 కోట్ల ధాన్యం కొనుగోలు బకాయిలను ఎగ్గొడితే, చంద్రబాబు ప్రభుత్వం చెల్లించిందన్నారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అస్తవ్యస్తం ప్రభుత్వ విధానాల ఫలితంగా చేపల మేత ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఓ పక్క అధిక విద్యుత్ ధరల భారం ఇతర ఖర్చులు పెరగడంతో పాటు మార్కెట్ ట్రేడర్లు చేపల ధరలు తగించి కొనుగోలు చేసేవారు.
కాకినాడ పోర్టుకు సంబంధించి అనేక విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా ఎగుమతి చేస్తున్న బియ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ ఇటీవల కాకినాడ పోర్టులో పర్యటించారు. అక్కడ జరుగుతున్న అక్రమాలను గుర్తించారు.
మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీలో చేరేముందు టీడీపీ కార్యకర్తలకు క్షమాపణ చెప్పాలనే డిమాండ్ వినిపిస్తోంది. కాగా మంగళవారం మధ్యాహ్నం ఉండవల్లిలోని సీఎం నివాసంలో చంద్రబాబుతో ఆళ్ల నాని భేటీ కానున్నారు. మరోవైపు ముఖ్య నేతలు ఉండవల్లి రావాల్సిందిగా టీడీపీ హైకమాండ్ నుంచి పిలుపు అందింది.